close

తాజా వార్తలు

కర్ణాటక ఉపపోరు వాయిదా

సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

దిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈసీ తన నిర్ణయాన్ని ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉప ఎన్నికలు వాయిదా వేసేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. అనర్హత వేటు ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధర్మాసనానికి తన నిర్ణయాన్ని ఈసీ తెలిపింది. అక్టోబర్‌ 22న తదుపరి విచారణను సుప్రీం కోర్టు చేపట్టనుంది.

కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. దీనిపై సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీలకు జరగాల్సిన ఎన్నికలతో పాటు కర్ణాటకలోని 15 స్థానాలకు కూడా ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24న ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉప పోరు వాయిదా పడింది. దీంతో కర్ణాటక రాజకీయం మరోసారి ఉత్కంఠగా మారింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.