
తాజా వార్తలు
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. తాజాగా ఇందులోని ‘జాతర’ అనే పాటను 4500 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించారట. 14 రోజులపాటు ఈ ఒక్కపాట షూటింగ్ మాత్రమే జరిగిందట. అంతమంది డ్యాన్సర్లతో ఒక పాటను చిత్రీకరించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఓ ఫొటోను పోస్ట్‌ను అభిమానులతో పంచుకుంది.
‘సైరా నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
