
తాజా వార్తలు
దిల్లీ: రాబోయే నాలుగేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహించే 12 ప్రధాన టోర్నీలకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఫేస్బుక్ సొంతం చేసుకుందని ఐసీసీ వెల్లడించింది. 2019 నుంచి 2023 వరకు నిర్వహించే అన్ని మెగా ఈవెంట్లు ఇందులో భాగం కానున్నాయని తెలిపింది. 2020, 2021 టీ20 ప్రపంచకప్‌లు, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీలతో పాటు 2020, 2022లో జరిగే అండర్ 19 ప్రపంచకప్ ఈవెంట్ల డిజిటల్ హక్కులను ఫేస్బుక్ దక్కించుకుంది. మ్యాచ్ అనంతరం వచ్చే రీక్యాప్స్, ఆటలోని విశేష సంఘటనలతో పాటు మరిన్ని వీడియోలను ఫేస్బుక్ ప్రసారం చేయనుండటం విశేషం.
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే ఈ విషయంపై మాట్లాడుతూ ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని, క్రికెట్ అభిమానులకు డిజిటల్ రూపంలో మరింత చేరువయ్యేందుకు ఈ విధంగా ముందుకొచ్చామని చెప్పాడు. తమ ఆలోచనలకనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించడానికి ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యమయ్యామని చెప్పాడు. మరోవైపు ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో డిజిటల్ వ్యూయర్ల సంఖ్య 4.6 బిలియన్లుగా నమోదైంది. కేవలం ఫేస్బుక్ ద్వారానే 1.2బిలియన్ల నిమిషాల వీడియోలను అభిమానులు వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను విస్తరించుకోవడంతో పాటు క్రికెట్ అభిమానులకు చేరవయ్యేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
