
తాజా వార్తలు
హైదరాబాద్: టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తన స్నేహితురాలు మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. ‘నీకు సెలబ్రిటీల్లో ఎవరైనా క్రష్ ఉన్నారా?’ అని మంచు లక్ష్మి ప్రశ్నించగా.. ‘బాలీవుడ్లో రణ్వీర్ సింగ్, టాలీవుడ్లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం’ అని రకుల్ పేర్కొన్నారు. ఇదే సందర్భంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా ఆమె చెప్పారట. ఈ షోలో సమంత, వరుణ్‌తేజ్ కూడా పాల్గొన్నారు. ఇటీవల వారికి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి.
రకుల్ ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కథానాయకుడుగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కాజల్ కథానాయిక. రకుల్‌తోపాటు సిద్ధార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఇందులోని ఓ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకొన్నారు. మరోపక్క రకుల్ ‘మర్జావా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్, తారా సుతారియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో రకుల్ ప్రత్యేక గీతంలో చిందేస్తూ కనిపించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
