
తాజా వార్తలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి, అమితాబ్ సహా ఇతర తారాగణం ధరించిన వస్త్రాలు, ఆభరణాలను మంగత్రాయ్ జ్యువెల్లర్స్ వారు శనివారం నగరంలో ప్రదర్శించారు. ఈ నగలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల పాల్గొని సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ‘సైరా’ సినిమా కోసం మంగత్రాయ్తో కలిసి పనిచేయటం గొప్ప అనుభూతిని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
