close

తాజా వార్తలు

నటుడిగా నా జీవితం ఇక్కడే మొదలైంది: చిరు

చరణ్‌ నన్ను ప్రమోట్‌ చేస్తున్నాడు

చెన్నై: ఆర్టిస్టుగా తన జీవితం చెన్నైలో మొదలైందని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఆయన నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసిన సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్‌ చరణ్‌ నిర్మించారు. చెన్నైలో ఈ చిత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు తమిళంలో ప్రసంగం ప్రారంభించారు.

‘ఈ సినిమాను తమిళ్‌లో ప్రమోట్‌ చేస్తున్న ఆర్బీ చౌదరికి ముందుగా ధన్యవాదాలు. ‘సైరా’ నా డ్రీమ్‌ ప్రాజెక్టు. నా కల ఇవాళ నిజమైంది. ఈ సినిమా కథ దాదాపు 12 ఏళ్ల క్రితం నా వద్దకు వచ్చింది. కానీ నటించే అవకాశం రాలేదు. రూ.400 కోట్లు అవసరం కావడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. నేను రాజకీయల్లోకి వెళ్లాను. తిరిగి చిత్ర పరిశ్రమకు వచ్చా. ‘కత్తి’ తెలుగు వర్షెన్‌లో నటించా, హిట్‌ అయ్యింది. రీ-ఎంట్రీ తర్వాత ప్రజలు నన్ను స్వీకరిస్తారా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ ‘ఖైదీ నంబర్‌ 150’కి వచ్చిన స్పందనతో.. నా ఇమేజ్‌ ఇంకా అలానే ఉంది అనుకున్నా (నవ్వుతూ). చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ‘సైరా’ సినిమా తీయాలనే ఆలోచన మళ్లీ నాలో మెదిలింది. ఆ విషయాన్నే చరణ్‌కు చెప్పా. ‘నాకు అర్థమైంది నాన్న.. మనమే తీద్దాం..’ అన్నాడు. చరణ్‌ రెండో సినిమా ‘మగధీర’ ఓ కాస్ట్యూమ్స్‌ డ్రామా. నా 150 సినిమాల్లో ఒకటి కూడా అలాంటిది లేదు. నాకు పీరియడ్‌ మూవీస్‌లో నటించే అవకాశం రాలేదు. నాకు నిన్ను చూస్తే అసూయగా ఉంది చరణ్‌ అని కూడా చెప్పాను. అందుకే నా కోసం ఈ సినిమా తీసి, బహుమతిగా ఇవ్వాలని చరణ్‌ అనుకున్నాడు.. థాంక్యూ సో మచ్‌. సాధారణంగా చిత్ర పరిశ్రమలో తండ్రి కుమారుడ్ని ప్రమోట్‌ చేస్తుంటాడు. కానీ ఇక్కడ నా కుమారుడు నన్ను ప్రమోట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు (నవ్వుతూ)’.

‘నా స్నేహితుడు కమల్‌ హాసన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రారంభం, క్లైమాక్స్‌లో వాయిస్‌ ఓవర్‌ వస్తుంది. దాన్ని చెప్పమని కమల్‌ను అడిగాను. ఆయన దాన్ని బాధ్యతగా తీసుకుని, చెప్పారు. అభ్యంతరం చెప్పలేదు. తెలుగు వాయిస్‌ ఓవర్‌ నా సోదరుడు ఇచ్చాడు. మలయాళంలో మోహన్‌లాల్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. తమన్నా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె అద్భుతమైన నటి. చరణ్‌కు జంటగా నటించిన అమ్మాయితో నేను ఎలా నటించాలనే ఆలోచన ఉండేది. తమన్నా ‘లక్ష్మి’ పాత్రలో ఒదిగిపోయారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది’ అని చిరు చెప్పారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.