close

తాజా వార్తలు

కొండల మీద చల్లగా ఉంటుందేం?

ప్రశ్న: భూతలం నుంచి పైకి వెళ్లేకొద్దీ వాతావరణం చల్లబడిపోతుంది. ఎందుకని? సూర్యుడికి దగ్గరగా వెళ్లేకొద్దీ ఎక్కువ వేడిగా ఉండాలి కదా?

- డి.చంద్రశేఖర్‌, పదో తరగతి, జడ్‌.పి.హెచ్‌.స్కూల్‌, పేరూరు

 

* భూమి చుట్టూ ఎన్నో కిలోమీటర్ల ఎత్తుమేర గాలి ఉంది. భూమి నుంచి 10 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తు వరకున్న గాలి పొరను ట్రోపోస్పియర్‌ అంటారు. సూర్యుని నుంచి వచ్చే వేడిని ఈ గాలి పొర ఏమాత్రం పీల్చుకోలేదు. ఈ కారణంగా సూర్యకిరణాలు ఈ గాలి పొరగుండా దూసుకువచ్చినా అక్కడి గాలి ఏమాత్రం వేడెక్కదు.
* సూర్య కిరణాలు నేలను తాకేసరికి భూమి త్వరగా వేడెక్కుతుంది. నేల వేడికి దగ్గర్లో ఉన్న గాలి వేడెక్కి తేలికై భూ వాతావరణం గుండా పైకి వెళుతుంది.
* ఇలా పైకి వెళ్లిన గాలి.. వాతావరణ పీడనం తక్కువగా ఉండే కొండ ప్రాంతాలకు చేరేసరికి వ్యాకోచం చెందుతుంది.
* గాలి వ్యాకోచం చెందాలంటే దానికి శక్తి కావాలి. వేడిగాలిలో ఉండే ఉష్ణశక్తిని వాడుకుని గాలి వ్యాకోచం చెందుతుంది. దీంతో వేడిని కొంత కోల్పోయిన గాలి చల్లబడుతుంది. అందుకే కొండల మీద గాలి చల్లగా ఉంటుంది.
* భూతలం నుంచి ప్రతి 300 మీటర్ల ఎత్తుకు గాలి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున తగ్గిపోతుంది. అందుకే ట్రోపోస్పియర్‌పైకి వెళ్లేసరికి అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 60 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది.
* ఈ ట్రోపోస్పియర్‌పైన ఉండే ఓజోన్‌ పొర సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలను పీల్చుకుంటుంది. అందువల్ల ఆ ప్రాంతం వేడిగా ఉంటుంది.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.