
తాజా వార్తలు
హైదరాబాద్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి శనివారంతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 28, 2007లో ఆయన నటించిన మొదటి చిత్రం ‘చిరుత’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చరణ్ సతీమణి ఉపాసన, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి ఆయనతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘చెన్నై అద్భుతమైన అతిథ్యం ఇచ్చింది. ఈ రోజు రెండు ప్రత్యేక విషయాలను పురస్కరించుకొని వేడుక చేసుకున్నాం. రామ్‌చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. అంతేకాకుండా ‘సైరా’ ప్రెస్‌మీట్ చాలా బాగా జరిగింది. తమన్నాతో చాలా సంతోషంగా గడిచింది.’ అని ఉపాసన ట్వీట్ చేశారు.
టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. నయనతార కథానాయిక. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రబృందం ‘సైరా’ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం చెన్నైలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో చిరంజీవి, రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన తమన్నా పాల్గొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
