
తాజా వార్తలు
ఎర్రటి గట్టి దేహంతో... దానిపై నల్లటి మచ్చలతో... పాక్కుంటూ ఇలా వచ్చేసిందో జీవి... దాని పేరు లేడీ బగ్... కానీ అది దాని పేరు కానే కాదంటోంది... ఇంకేదో చెబుతానంటూ ఇలా వచ్చేసింది!
హల్లో నేస్తాలూ! అంతా బాగేనా? నేనైతే సూపరు. ఆ ఉత్సాహంలోనే నన్ను నేను పరిచయం చేసుకుని మీతో స్నేహం చేద్దామని ఇలాగొచ్చేశా.
బగ్ని కాను!
అంతా నన్ను అక్షింతల పురుగు, అగ్గిపురుగు అంటుంటారు. ఇంగ్లిష్లో అయితే లేడీబగ్ అనేస్తారు. నిజానికి నేను పురుగును కాను. బీటిల్ల రకానికి చెందినదాన్ని. అంటే మా వీపు మీద గట్టి కవచంలాంటి రెక్కలుంటాయి. నోరు కుట్టడానికి కాకుండా
నమిలేందుకు వీలుగా ఉంటుంది. ఇలా ఉన్న కీటకాల్ని బీటిల్స్ అంటారన్నమాట. అందుకే మరి.. నా అసలు పేరు లేడీ బర్డ్ బీటిల్ అని మొత్తుకుంటున్నా ఎవరూ వినట్లా.
చలికాలంలో గుడ్లు!
మేం పుట్టిన వెంటనే ఇలా ఉంటామనుకుంటున్నారేమో! కాదూ! మా తల్లి మొక్కల మీద గుడ్లు పెడుతుందా?ముందు వాటి నుంచి లార్వాలు బయటకొస్తాయి. అవి ఆకుల్ని తిని ప్యూపాలుగా మారిపోతాయి. వాటిలోంచి లేత రంగులో ఉన్న మేం
బయటకొస్తాం. కొన్నాళ్లకు ఇలా ఆకర్షణీయమైన రంగుల్లోకి మారతాం. పెద్దై గుడ్లు పెడతాం. ఇలా మా జీవన చక్రం తిరుగుతుంటుంది.
ఎర్రగానే ఉండం!
మా పేరు తలుచుకోగానే ఎర్రటి శరీరంపై నల్లటి మచ్చలు, ఇంకా నల్లటి ముఖం గుర్తొచ్చేస్తుంది. నిజానికి మాలో ఐదు వేలకు పైగా రకాలుఉన్నాయి. ఆ తేడాల్ని బట్టి కొన్ని పసుపు, నలుపు, గోధుమ వర్ణం.. ఇలా వేరే వేరే రంగుల్లోనూ ఉంటాయి. పైన ఉండే మచ్చల్లోనూ తేడాలు ఉంటాయి.
కనిపించామా లేదా?
ఇంతకీ మీరు నేరుగా నన్నెప్పుడైనా చూశారా లేదా? అవును అంటే గనుక ఓ లైక్ కొట్టమనే దాన్ని. కానీ నాకు మీకులా ఫేసుబుక్కులు లేవు. ఎప్పుడూ చూడలేదంటే గనుక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. నేను బొద్దింకల కంటే చిన్నగానే ఉంటా. మీ గోరులో సగమైనా ఉంటానో ఉండనో! ఇంకానేమో రెండు నుంచి మూడేళ్లపాటు బతికేస్తా.
రైతులకిష్టం!
మేమంటే రైతులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే పంటలకు హాని చేసే రసం పీల్చే పురుగుల్లాంటి వాటిని మేం రోజూ భోంచేసేస్తాం కాబట్టి. వారంలో నాలుగైదు వందల పురుగుల్ని తిని పొట్ట నింపుకొంటాం. అలా మీకు సాయపడతాం. అందుకే మేం పొలాల్లో కనిపిస్తే అదృష్టంగా భావిస్తుంటారు కొందరు. అయితే మాలో కొన్ని రకాలవి మాత్రం ఆకుల్నీ తిని ఆకలి తీర్చుకుంటాయి.
రంగులతో భయపెట్టేస్తా!
మా జాతిలో ఉన్న పెద్దవన్నీ ఆకర్షణీయమైన రంగుల్లోనే ఉంటాయి. ఆ వర్ణం అంతా మా గట్టి రెక్కలదే. అవే మాకు రక్షణ కవచంలా ఉంటాయి. ఇంకానేమో ఇలాంటి రంగులతో అవతలి శత్రువుల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్నదీ మా ఆలోచనే. ఇంకా మేమోరకమైన విషాన్ని విడుదల చేస్తాం. మేం ఎక్కువ ముదురు రంగుల్లో ఉంటే అది ఎక్కువ విషపూరితం. అది మీకెలాంటి హానీ చేయదుగానీ పక్షుల్లాంటి శత్రువుల్ని దగ్గరకి రానీయదు.
ఆకారంలో ఇంత చిన్న వాళ్లమైనా గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ఎగిరేస్తుంటాం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
