close

తాజా వార్తలు

‘సైరా’ వీడియో సాంగ్‌ చూశారా..?

హైదరాబాద్‌: ‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ అవురా.. ఉయ్యాలవాడ నరసింహుడా.. చరిత్రపుటలు విస్మరించ వీలులేని వీర.. రేనాటి సీమ కన్న సూర్యుడా.. నింగి శిరసు ఒంచి నమోస్తు నీకు అనగా.. నవోదయానివై జయించినావురా.. ఓ సైరా’ ఈ మాటలు వింటుంటానే అర్థమవుతుంది ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని చెబుతూ రచించిన పాట అని. చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలోని మొదటి వీడియో పాటను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

‘ఆలిని, బిడ్డని, అమ్మని, జన్మని, బంధనాలన్ని వదిలి సాగుదాం.. నువ్వే లక్షలై.. ఒకే లక్ష్యమై..’ అని నయనతార, తమన్నా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కీర్తించారు. ఈ పాట వింటుంటే  రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తమన్నా నటన ఈ పాటను మరో స్థాయికి తీసుకువెళ్లింది. పాటలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. అమిత్‌ త్రివేది అందించిన సంగీతం చాలా అద్భుతంగా ఉంది. శ్రేయా ఘోషల్‌ వాయిస్‌ ఈ పాటకు ప్రాణం పోసింది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నయనతార కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.