
తాజా వార్తలు
* ఎవరీ అమ్మాయి?
పదకొండేళ్ల ఈ అమ్మాయి పేరు రిధిమా పాండే. వీళ్లది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్.
* మన పేజీలోకి ఎందుకొచ్చింది?
ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఎంతో ఆలోచించింది కాబట్టి. ఎంతో పెద్ద పని చేసింది కాబట్టి.
* ఏంటో ఆ పెద్ద పని?
మన ప్రభుత్వంపై పిటిషన్ వేసింది. ఎక్కడనుకుంటున్నారు? ఐక్యరాజ్యసమితిలోని బాలల హక్కుల కమిటీలో.
* పిటిషన్ ఏమని వేసింది?
పర్యావరణం గురించి అస్సలు పట్టించుకోకుండా తమ(బాలల) హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని అందులో రాసింది. కాలుష్య కారకాలు వాతావరణంలో పెరిగిపోతుండటంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంది. హరిత వాయువుల నుంచి తమ భవిష్యత్తును రక్షించాలంటూ అడిగింది. ప్రభుత్వం దీనిపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరింది.
* ఇదంతా ఐక్యరాజ్య సమితికి చెప్పిందా?
అవును. కొన్ని దేశాలకు చెందిన మొత్తం 16 మంది పిల్లలు కలిసి తమ దేశాల్లో కాలుష్యం గురించి, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యత గురించి వివరిస్తూ యూఎన్‌లో పిటిషన్లు వేశారు. వాళ్లలో రిధిమా కూడా ఉంది. అంతే కాదు. మొన్నీమధ్య అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘యునైటెడ్ నేషన్స్ యాక్షన్ సమ్మిట్’లోనూ పాల్గొంది. అంత పెద్ద వేదికపై పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏమిటో వివరిస్తూ తన అభిప్రాయాల్ని భయం లేకుండా చెప్పేసింది.
* ధైర్యవంతురాలే!
నిజమే. ధైర్యవంతురాలు కాబట్టే పర్యావరణాన్ని రక్షించుకోవడంపై చిన్నప్పటి నుంచే ప్రదర్శనలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే మన ప్రభుత్వం తీరును విమర్శిస్తూ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసింది.
* పర్యావరణంపై తన శ్రద్ధకు కారణం ఎవరు?
ఆమె తండ్రి. ఆయన ఉత్తరాఖండ్‌లో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంటారు. పేరు దినేష్ పాండే. వాతావరణాన్ని రక్షించుకోవడంపై జరిగే ప్రదర్శనల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయన ప్రభావమే రిధిమా పైనా ఉంది. మొన్న న్యూయార్క్కూ తండ్రితో పాటే వెళ్లింది.
* ఆమె ఆశయం ఏంటి?
‘ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించాలి. కంపెనీలు దీన్ని తయారు చేయడం మొత్తానికే ఆపేయాలి. మాకు మంచి భవిష్యత్తు ఉండాలి. భవిష్యత్ తరాల కోసం అందరూ భూమిని రక్షించాలి. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి’ అంటూ కోరుతోందీ చిన్నారి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
