close

తాజా వార్తలు

‘సైరా’లో చిరంజీవికి... ట్విటర్‌లో యువతకి...

అమితాబ్‌ బచ్చన్‌ వయసు 76 ఏళ్లంటే ఎవరన్నా నమ్ముతారా? ఆయన ఎంచుకున్న కథలు, చూపించే నటన అలా ఉంటాయి మరి. యువ నటులతో పోటీ పడి నటిస్తున్నారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సోషల్‌ మీడియాలోనూ యువతకు ఏ మాత్రం తక్కువ కాకుండా యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్‌లో సొంత విషయాలనే కాదు, సమాజంలో జరిగే ఘటనలపై స్పందిస్తుంటారు. యువతకు స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలు రాస్తుంటారు. ‘సైరా’లో మెగాస్టార్‌ చిరంజీవికి గురువు అయిన ఈ సూపర్‌స్టార్‌... ట్విటర్‌ పోస్టులతో యువతకు ఎలా గురవయ్యారో చూద్దాం!

 

అభిమానులకు అభివాదం

ప్రతి ఆదివారం అమితాబ్‌ ఇంటి ముందు అభిమానులు సందడి చేస్తారు. అలా వచ్చిన వారికి బిగ్‌ బి సాదరంగా స్వాగతం పలికి అభివాదం చేస్తుంటారు. ఈ ఆదివారం ఇలా అభిమానులతో గడిపారు.

కూతురికి ప్రేమతో..

అందరి తండ్రుల్లాగే.. అమితాబ్‌కు కూతురు శ్వేతా నందా అంటే అమితమైన ప్రేమ. డాటర్స్‌ డే సందర్భంగా ‘కూతుళ్లే మిన్న’ అంటూ కూతురుతో దిగిన ఫొటోను పోస్టు చేశారు.

అమితాబ్‌ ఇంట.. ‘సైరా’ పోస్టర్‌

ఎప్పటిలాగే రెండు వారాల క్రితం తన కోసం వచ్చిన అభిమానులను అమితాబ్‌ పలకరించారు. అయితే అక్కడి పోస్టర్‌లో ‘సైరా’లోని గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ పోస్టర్‌ కనిపించడం విశేషం.

రీల్‌ డాటర్‌ దీపికాతో బిగ్‌ బీ

‘పీకూ’లో దీపికా పదుకొనె తండ్రిగా అమితాబ్‌ నటించారు. డాటర్స్‌ డే నాడు ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల చిత్రాలను ఓ బృందం రూపొందించిన పోస్టును అమితాబ్‌ రీట్వీట్‌ చేశారు.

రియల్‌ లైఫ్‌ కల.. రీల్‌ లైఫ్‌ నెరవేర్చింది

డాక్టర్‌, ఆస్ట్రోనాట్‌... జీవితంలో ఆ రెండు ఎలాగూ కాలేను. కానీ చిత్రసీమ నా కలను నెరవేర్చిందంటూ బిగ్‌ బీ చేసిన ట్వీట్‌ ఇది.

కేబీసీ.. ఆల్వేస్‌ నంబర్‌ 1

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ అమితాబ్‌ను అభిమానులకు మరింత చేరువ చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమం నాన్‌ ఫిక్షన్‌ కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా.. ఈ పోస్ట్‌ చేశారు. 

బొజ్జగణపయ్య సేవలో బిగ్‌ బీ

అమితాబ్‌కి దైవభక్తి ఎక్కువ. ఆయన మాటల్లో... ట్వీట్లలో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఇటీవల గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న సందర్భంలో...

సెల్ఫీపై సెటైర్‌

‘సెల్ఫీ దిగనిదే.. ప్రపంచం కదలలేదేమో’ అంటూ యువత సెల్ఫీ క్రేజ్‌పై ఆవేదన వ్యక్తం చేసిన బిగ్‌ బీ. ఇందులో ఎంతమంది అమితాబ్‌తో సెల్ఫీ దిగుతున్నారు చూడండి.

ఎన్డీఆర్‌ఎఫ్‌కు సెల్యూట్‌

ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను కాపాడటానికి నిబద్ధతతో పనిచేసే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని చూసి గర్వపడుతున్నామంటూ వారికి సెల్యూట్‌ చేస్తూ అమితాబ్‌ ట్వీట్‌...

నేను చేస్తే.. ఎవరూ తినరు

అమితాబ్‌ ఈ మధ్య ఓ యాడ్‌ కోసం ఇలా చెఫ్‌ అవతారమెత్తారు. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నేను చేస్తే ఎవరూ తినరు’ అని రాశారు. టేస్ట్‌ సంగతేమో కానీ.. ఆ ట్వీటును మాత్రం యూత్‌ తెగ లైక్‌ చేసింది.

రక్షాబంధన్‌ సందర్భంగా..

సోదరి ప్రేమ.. సోదరుడి రక్షణ... ఈ బంధం ఎప్పటికీ నిలిచిపోతుందంటూ పిల్లలతో దిగిన నాటి ఫొటోలను ఇలా పంచుకున్నారు

‘షోలే’ ఎవర్‌గ్రీన్‌ చిత్రం

‘షోలే’ విడుదలై 44 ఏళ్లు అయిన సందర్భంగా.. గొప్ప కథ, గొప్ప క్యాస్టింగ్‌ అంటూ బిగ్‌ బీ ఆనాటి సినిమా పోస్టర్‌ను పంచుకున్నారిలా..

ఆమె లోటు తీరనిది

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్వర్గస్తులైన సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ బిగ్‌బీ చేసిన ట్వీట్‌ ఇదీ...

ఆటవిడపుగా ఆటలో..

తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ జట్టు జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆటగాళ్లు కబడ్డీ ఆడుతున్న సమయంలో... ఇలా వచ్చి వారిని ఉత్సాహపరిచారు

నటుడి అవతారం నుంచి.. యాంకర్‌ అవతారంలోకి

‘గులాబో సితాబో’ చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కోసం రెడీ అవుతూ.. ఇది చూస్తుంటే అమితాబ్‌ ఇన్ని ఎలా మేనేజ్‌ చేస్తున్నారబ్బా అనిపిస్తోందా?

చంద్రుడిని దాటిన విజయం

వరసగా ఐదు విజయాలు సాధించిన హిమా దాస్‌ మన దేశానికే గర్వం కారణమని ప్రశంసలు కురిపిస్తూ అమితాబ్‌ చేసిన ట్వీట్‌

ఆయన చాలా పొడవు.. అందుకే టీవీ అలా..

తనపై వచ్చిన ఫన్నీ కార్టూన్‌ను నెట్టింట్లో పెట్టిన అమితాబ్‌. ఇంత స్పోర్టివ్‌ నెస్‌ ఉంది కాబట్టే అమితాబ్‌ సూపర్‌స్టార్‌ అయ్యింది. 

 ఆ కష్టం చెప్పతరమా..

‘గులాబో సితాబో’ చిత్రంలో తనకు గెటప్‌ వేయడానికి 24 గంటలు పడుతుందంటూ మేకప్‌ వేసే చోటును ట్విటర్‌లో పంచుకున్న బిగ్‌ బీ 

పనిలో ఉన్నా.. నాన్న మరువునా

ఫాదర్స్‌ డే సందర్భంగా షూటింగ్‌లో ఉన్న అమితాబ్‌ తన కూతురు శ్వేత నందాతో దిగిన ఫొటో

గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటాం.. మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటాం. చాలా విచిత్రం కదా!

- అమితాబ్‌ బచ్చన్‌

జీవిత సత్యాన్ని చెప్పే వేదాంతాలు బిగ్‌ బీ ట్విటర్‌లో అనేకం కనిపిస్తాయి. ఆయన రాసే కొన్ని వాక్యాలు స్ఫూర్తినిస్తే..  మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అవే ఇవి!

 - ఉత్తమమైన ప్రతికారం ఏదైనా ఉందంటే.. అది నీ ఎదుగుదలే!

 - కొన్నింటిని వదిలేసుకోవడం నేర్చుకుంటేనే ఆత్మశాంతి కలుగుతుంది!

 - సమస్యని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే.. అందులోనే పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే సమస్య.. పరిష్కారం వేరుగా ఉండవు!

 - ప్రపంచంలో మనకు పోటీ ఏవరైనా ఉన్నారంటే.. అది నిన్నటి మనమే!

 - మన బహుమతిని కనిపెట్టడమే జీవితానికి అర్థం. దానిని ఇతరులకు ఇవ్వడమే మన జీవిత పరమార్థం!

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.