close

తాజా వార్తలు

‘సైరా’లో ఆసక్తికర విషయాలేంటో తెలుసా?

తెలుగు చిత్రపరిశ్రమ సరికొత్త ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలవైపు ముందుకు వెళ్తోంది. గత కొంతకాలం వరకూ కేవలం దక్షిణాదికే పరిమితమైన తెలుగు సినిమాలు ఇప్పుడు ఎల్లలు దాటుతున్నాయి. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సుస్పష్టంగా చూపించారు. ఆ స్ఫూర్తే ‘సైరా’ తీయడానికి కారణమని అగ్ర కథానాయకుడు చిరంజీవే స్వయంగా చెప్పారు. చిరు కీలక పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?

పాన్‌ ఇండియా..

కప్పుడు సినిమా అంటే హీరో, హీరోయిన్‌, విలన్‌ నాలుగైదు కామెడీ పాత్రలు కథంతా వీటి మధ్యే నడిచేది. కానీ, ఇటీవల కాలంలో దర్శక-నిర్మాతల ఆలోచన మారింది. ‘భారీ’దనం వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో పాన్‌ ఇండియా సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రాంతీయ సినిమా కాస్తా.. జాతీయ స్థాయికి వెళ్తోంది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’, ‘సాహో’ ఇప్పుడు ‘సైరా’. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ సైరాను విడుదల చేస్తున్నారు.

స్టార్లే స్టార్లు..

క సినిమాకు మరో భాషలో క్రేజ్‌ తీసుకొచ్చేందుకు ఆ భాషా నటుల ను సైతం సినిమాలోకి తీసుకుంటారు. ‘సైరా’లో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌సేతుపతి, కన్నడ స్టార్‌ సుదీప్‌లతో పాటు, అగ్ర కథానాయికలు నయనతార, తమన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం నుంచి పృథ్వీరాజ్‌ను కూడా ఓ పాత్రకు అనుకున్నారు. అయితే, వేరే సినిమాల్లో బిజీగా ఉండటంతో చేయలేకపోయారు.

బాహుబలిని మించిన వీఎఫ్‌ఎక్స్‌


 

విజువల్‌ వండర్‌ అంటే ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలే గుర్తుకొస్తాయి. అద్భుతమైన విజువల్స్‌తో జక్కన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సినిమాల్లో 2300 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ వాడితే, ‘సైరా’లో ఏకంగా 3800 షాట్స్‌ ఉన్నాయట. ‘భావోద్వేగాలతో కూడిన చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ జోడించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సురేందర్‌రెడ్డి అద్భుతంగా వాటిని తీర్చిదిద్దాడు’ అని ఇటీవల రాజమౌళి ప్రశంసించారు.

ఆ ఫైట్‌ 35 రోజులు షూట్‌

‘సైరా’లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది యాక్షన్‌ సన్నివేశాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసం హాలీవుడ్‌ స్టంట్స్‌మెన్‌పనిచేశారు. నాసమ్‌ ఫోర్ట్ వద్ద జరిగే యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌ను 35రోజుల పాటు తెరకెక్కించారు. దాదాపు 2వేలమంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, ఫైటర్లు ఈ సన్నివేశంలో పాల్గొన్నారు.

100మందికి పైగా ఆడిషన్స్‌ చేస్తే..

స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో బ్రిటిష్‌ వాళ్ల పాత్రలు వేయడానికి ఆ దేశానికి చెందిన నటులైతేనే దానికి సహజత్వం వస్తుంది. అందుకే లండన్‌కు చెందిన 100మందికిపైగా నటులను ఆడిషన్స్‌ చేసి వారి నుంచి కేవలం 7గురిని మాత్రమే చిత్ర బృందం ఎంపిక చేసింది. దాదాపు నెల రోజులకు పైగా ఈ ఆడిషన్స్‌ జరగడం విశేషం. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సినిమా కోసం చిత్ర బృందం ఏ స్థాయిలో కసరత్తు చేసిందో.

4500మంది డ్యాన్సర్లు

‘సైరా’కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇందులోని ‘జాతర’ పాట. ఈ సాంగ్‌ను 4500మంది డ్యాన్సర్లతో దాదాపు 14రోజుల పాటు చిత్రీకరించారు. ఒక పాటను ఇంతమంది డ్యాన్సర్లతో గతంలో ఏ చిత్రంలోనూ తీసుకోలేదు. సినిమాలోని గీతాల్లో ఇది కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

క్లైమాక్స్‌ కోసం రూ.72కోట్లు

‘సైరా’లో హైలైట్‌గా నిలిచేది ఫైట్‌ సీన్లు. ఇందుకోసం హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన కొరియోగ్రాఫర్లను తీసుకున్నారు. ముఖ్యంగా ‘స్కైఫాల్‌’, ‘హ్యారీపోటర్‌’ చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన గ్రెగ్‌పావెల్‌, లీవిట్టెకర్‌ తదితరులు పనిచేశారు. క్లైమాక్స్‌ సన్నివేశాలను జార్జియాలో తెరకెక్కించారు. ఇందుకోసం 250మంది చిత్ర బృందం అక్కడకు వెళ్లింది. దాదాపు నెలన్నర రోజులు తీసిన యాక్షన్‌ సన్నివేశాలకు రూ.72కోట్లు ఖర్చు చేశారట. యుద్ధ సన్నివేశాలతో పాటు, అండర్‌ వాటర్‌లో తీసిన సీన్లు ఒళ్లు గగురుపొడుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. 

రామ్‌చరణ్‌ నటించాల్సింది

సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌దత్‌లతో చేయిద్దామని చిత్ర బృందం భావించింది. వాళ్లు కూడా ఒప్పుకొన్నారు. అయితే, ఆ పాత్ర రామ్‌చరణ్‌ చేస్తే బాగుంటుందని పరిశీలించారు. అయితే, కథలో ఆ పాత్ర చనిపోతుంది. దీంతో ప్రేక్షకులు హర్షించరని వద్దనుకున్నారు. దీంతో ‘సైరా’లో రామ్‌చరణ్‌ నటించే అవకాశం మిస్సయ్యారు. అయితే, నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం కొద్దిసేపు కనిపించనున్నారు. 

ఏఆర్‌ రెహమాన్‌ అనుకున్నారు

‘సైరా’లాంటి భారీ ప్రాజెక్టుకు ఆ స్థాయి సంగీత దర్శకుడు అని చిత్ర బృందం భావించింది. అందుకు తగినట్లే తొలుత ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ను చిత్ర బృందం తీసుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారు. రెహమాన్‌ తర్వాత చాలా పేర్లు వినిపించినా, చివరకు అమిత్‌ త్రివేదిని తీసుకున్నారు. ఇక కథకు ఎంతో బలమైన నేపథ్య సంగీతం కోసం ‘టైగర్‌ జిందాహై’, ‘భారత్‌’ వంటి భారీ ప్రాజెక్టులకు పనిచేసిన జూలియస్‌ పాఖియం ఎంపిక చేశారు. 

పవన్‌కల్యాణ్‌ స్వరం..

బుధవారం విడుదల కాబోతున్న ఈ చిత్రం సినీ నటుడు, చిరు సోదరుడు పవన్‌కల్యాణ్‌ వాయిస్‌తోనే ప్రారంభం కానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథను పవన్‌ స్వరం నుంచే వినబోతున్నాం. చివర్లోనూ పవన్‌ చెప్పే డైలాగ్స్‌తోనే సినిమా ముగుస్తుందని సమాచారం. 

ఇప్పటికీ రిలీజ్‌ కాని లుక్‌.. 

టీవల కాలంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే గుర్తొచ్చే నటి స్వీటి అనుష్క. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహబలి: దేవసేన’ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ‘సైరా’లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయిగా కనిపించనున్నారు. అయితే, ఆమె పాత్ర, లుక్‌ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం. ఆ పాత్ర తాలుకూ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.