
తాజా వార్తలు
జోక్యం చేసుకోలేం
హైదరాబాద్: ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో బుధవారం సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి.
మొదట ‘సైరా’ ఓ బయోపిక్ అని పిటిషన్ వేసిన తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకుడు కేతిరెడ్డి ఇప్పుడు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సినిమాను కేవలం వినోదం పరంగా చూడాలని తెలిపింది. ఎంత మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఎవరు చూపించారని ప్రశ్నించింది. సినిమాను కల్పిత పాత్రలతో చూపిస్తారంటూ గతంలో గాంధీజీ, మొగల్ సామ్రాజ్యంపై తెరకెక్కించిన సినిమాలను ప్రస్తావించింది. సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనే విషయాలను ప్రేక్షకులకు వదిలేయాలని పేర్కొంది. ఇప్పుడు సినిమాను తాము ఆపలేమని హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
