
తాజా వార్తలు
450 కిలోలతో...
హైదరాబాద్: యువ కథానాయకుడు రామ్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు. నటించబోయే పాత్రకు అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన 1000 పౌండ్లతో (దాదాపు 450 కిలోలు) లెగ్ ప్రెస్ కసరత్తులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతోపాటు #RAPO18 అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. తన 18వ సినిమాలోని లుక్ కోసం ఇలా సిద్ధమౌతున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన ఫాలోవర్స్ ఆశ్చర్యపోయారు. రామ్ అంకితభావాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. 18వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి విజయం అందుకున్న తర్వాత రామ్ దర్శకుడు కిశోర్ తిరుమల తీయనున్న సినిమాలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ప్రేమకథా సినిమాలు వచ్చాయి. ఈ సారి క్రైమ్ నేపథ్యంలో సినిమా రాబోతున్నట్లు తెలిసింది. తమిళ హిట్ ‘తడమ్’కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందనున్నట్లు సమాచారం. దసరాకి ఈ సినిమా ప్రారంభం కానుందట.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
