close

తాజా వార్తలు

గాంధీ తాత... మీకు తెలిసిందెంత?

బోసినవ్వుల గాంధీ తాత 150వ జయంతి ఈ రోజే... మనలో స్ఫూర్తినింపిన మహాత్ముడి సంగతులెన్నో... ఆయన విశేషాలు మీకెంతవరకూ తెలుసు?ఒక్కసారి పరీక్షించుకుంటారా?అయితే ఈ క్విజ్‌ను చకచకా చేసేయండి.

1. మహాత్మా గాంధీ ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు?
2. ఆయనకు ఎంతమంది తోబుట్టువులు?
3. చిన్నప్పటిముద్దు పేరు?
4. తండ్రి ఏం చేస్తుండేవారు?
5. ఏ వయసులో పెళ్లి జరిగింది?
6. తరగతి గదిలో ఇన్‌స్పెక్షన్‌ జరుగుతున్నప్పుడు ఆయన తప్పుగా రాసిన పదం ఏంటి?
7. భార్య పేరు?
8. గాంధీజీలో స్ఫూర్తి నింపిన పురాణ పాత్రలు ఏవి?
9. న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఎక్కడికి వెళ్లారు?
10. ఆయన పిల్లల పేర్లు?
11. భారత దేశానికి తిరిగి వచ్చాక న్యాయవాద వృత్తిని ఎక్కడ మొదలుపెట్టారు?
12. దక్షిణాఫ్రికాకు ఎందుకు వెళ్లారు?
13. దక్షిణాఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
14. ఏ దేశంలో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు?
15. ఆయన్ను రైల్లోంచి గెంటివేసింది ఏ స్టేషన్లో?
16. గాంధీజీ దక్షిణాఫ్రికాలో వ్యతిరేకించిన బిల్లు?
17. దక్షిణాఫ్రికాలో ఆయన ప్రచురించిన పత్రిక పేరు?
18. దక్షిణాఫ్రికాలో స్థాపించిన ఆశ్రమాలు?
19. లియో టాల్‌స్టాయ్‌ రాసిన ఏ పుస్తకం గాంధీకి స్ఫూర్తిని ఇచ్చింది?
20. దక్షిణాఫ్రికాను ఎప్పుడు వీడారు?
21. రాజకీయ గురువు?
22. మొదటిసారిగా నెహ్రూని ఎక్కడ కలిశారు?
23. సబర్మతీ ఆశ్రమాన్ని గాంధీజీ ఎప్పుడు స్థాపించారు?
24. భారత జాతీయ కాంగ్రెసుకు ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు?
25. ఏ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని మొదలుపెట్టారు?
26. దేనికి వ్యతిరేకంగా దండియాత్ర చేపట్టారు?
27. ఆంధ్రప్రదేశ్‌కి మొదటిసారిగా ఎప్పుడొచ్చారు?
28. చొక్కా వేసుకోకూడదని నిర్ణయించుకున్నది ఎప్పుడు?
29. క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆయన నినాదం ఏంటి?
30. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ఏ జైల్లో ఉన్నారు?
31. ముస్లింలు చేసిన ఏ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు?
32. ఆయన ఏ రెండింటిని తన ఊపిరితిత్తులని చెప్పుకొనేవారు?
33. ‘మహాత్మ’ అని ఆయనను ఎవరు పిలిచారు?
34. గాంధీజీ ఆత్మకథను ఏ భాషలో రాశారు?
35. గాంధీజీ పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఏ రోజుగా జరుపుకుంటారు?
36. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గాంధీజీ ఎక్కడున్నారు?
37. చనిపోయిన ఏడాది ఆయన గౌరవార్థం ఆపేసిన అంతర్జాతీయ బహుమతి ఏమిటి?
38. ఎక్కడ చనిపోయారు?
39. చనిపోయే నాటికి వయసు?
40. గాంధీ స్మృతివనం ఎక్కడుంది?


జవాబులు:

1.శుక్ల నామ సంవత్సరం (1869 అక్టోబర్‌ 2) 2. ముగ్గురు 3. మను, మోనియా 4. సంస్థానంలో దివాన్‌ 5. పదమూడేళ్ల వయసులో 6. కెటిల్‌ (kettle)7. కస్తూరి బాయి 8. హరిశ్చంద్రుడు, శ్రవణ కుమారుడు 9. ఇంగ్లాండు 10. హరిలాల్‌, మణిలాల్‌, రామదాస్‌, దేవదాస్‌ 11. ముంబయి, రాజ్‌కోట్‌ 12. ఒక న్యాయవాద కంపెనీలో కాంట్రాక్టుపనిమీద 13. 21 ఏళ్లు (1893 నుంచి 1914)   14. దక్షిణాఫ్రికాలో 15. పీటర్‌ మ్యారిట్జ్‌బర్గ్‌ 16. భారతీయుల ఓటు హక్కులను కాలరాసే బిల్లు 17. ఇండియన్‌ ఒపీనియన్‌ 18. టాల్‌ స్టాయ్‌ ఫార్మ్‌, ఫీనిక్స్‌ ఫార్మ్‌ 19. ద కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఈజ్‌ వితిన్‌ యూ 20. 1914లో 21. గోపాల కృష్ణ గోఖలే 22. లఖ్‌నవూ (1916) 23. 1917 జూన్‌ 17న 24. ఒక్కసారి (1924) 25. రౌలట్‌ చట్టం 26. ఉప్పుపై పన్ను నిషేధం కోసం 27. 1919లో 28. 1921 29.  డూ ఆర్‌ డై 30. పుణె 31. ఖిలాఫత్‌ 32. సత్యం, అహింస 33. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 34. గుజరాతీ  35.  అంతర్జాతీయ అహింసా దినోత్సవం 36. కోల్‌కతాలో 37. నోబెల్‌ 38. దిల్లీలో 39. 78 40. దిల్లీ


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.