close

తాజా వార్తలు

నరసింహారెడ్డికి చిరు ప్రాణం పోశారు: జక్కన్న

‘సైరా’.. సెలబ్రిటీల రివ్యూ!

హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రాణం పోశారని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రశంసించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరు నటించిన చిత్రమిది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మించారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం అందుకుంది. నెటిజన్లతోపాటు విమర్శకులు సైతం సోషల్‌మీడియాలో ‘సైరా’ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు ట్విటర్‌ ఇండియాలో ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ నం.1లో ఉండటం విశేషం. ఈ సినిమాను చూసిన జక్కన్న, హరీష్‌ శంకర్‌, శోభూ యార్లగడ్డ తదితరులు సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

* రాజమౌళి: చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ప్రాణం పోశారు. మరుగున పడిన చరిత్రను ఆయన వెలికితీశారు. జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా.. పాత్రలు కథలో నిమగ్నమయ్యాయి. సినిమా అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో చరణ్‌, సురేందర్‌ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
* హరీష్‌ శంకర్‌: ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది. ‘చిరంజీవి’ అయ్యింది. సురేందర్‌ రెడ్డి పనితీరు అద్భుతం. మెగా పవర్‌స్టార్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా 
 
 * శోభూ యార్లగడ్డ: ‘సైరా’ చాలా నచ్చింది. చిరంజీవి గారు అమేజింగ్‌. సురేందర్‌రెడ్డి చక్కటి యాక్షన్‌ డ్రామాతో కూడిన బ్లాక్‌బస్టర్‌ను రూపొందించారు. ప్రొడక్షన్‌, డిజైన్‌, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్‌.. అమోఘంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ ఉన్నతంగా ఉంది. తమన్నా నటన అద్భుతంగా ఉంది. రామ్‌ చరణ్‌ బృందానికి నా శుభాకాంక్షలు.
* అల్లు శిరీష్‌: మన మెగాస్టార్‌ను పీరియడ్‌ డ్రామాలో చూడటం ఓ చక్కటి అనుభవం. బచ్చన్‌ సర్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు, నయనతార, తమన్నా వెండితెరపై గొప్పగా కనిపించారు. అద్భుతమైన విజువల్స్‌ తీసిన సురేందర్‌రెడ్డి, మిగిలిన  సాంకేతిక నిపుణులకు హ్యాట్సాఫ్‌. సై సై సైరా.. ఈ సినిమాను చూస్తున్నప్పుడు నా ఒళ్లు గగుర్పొడిచింది. కొన్ని సన్నివేశాల సమయంలో కన్నీరు పెట్టుకున్నా.
* శ్రీనువైట్ల: ‘సైరా’ సినిమాను చూశా. మన మెగాస్టార్‌ చిరంజీవి ప్రతి ఫ్రేమ్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా జీవించారు. మమ్మల్ని చరిత్ర పుటల్లోకి తీసుకెళ్లారు. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. అది సినిమా అవుట్‌పుట్‌లో కనిపిస్తోంది. సినిమాపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కున్న ప్రేమకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన స్వాతంత్ర్య సమరయోధుడి కథను తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. నయనతార, తమన్నా తమ పాత్రలతో వెండితెరను మెరిపించారు. సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అందుకున్నందుకు శుభాకాంక్షలు. 
* సుధీర్‌బాబు: ‘సైరా నరసింహారెడ్డి’లో భావోద్వేగాలు, సినిమా ఇచ్చిన అనుభూతి అద్భుతం. మెగాస్టా్ర్‌ నటన అత్యద్భుతం. విరామానికి ముందు వచ్చే పోరాట ఘట్టం ఎంతో ఉత్తమంగా ఉంది. రత్నవేలు, సురేందర్‌ రెడ్డి పనితీరు సూపర్‌గా ఉంది. రామ్‌ చరణ్‌ నిర్మాణ విలువలు ఉన్నంత గొప్పగా నటీనటుల నటన కూడా ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.