close

తాజా వార్తలు

ఇక నుంచి నాకోపాన్ని చూపిస్తా: ఐష్‌

ముంబయి: ‘అందరూ ఇప్పటివరకు నా ప్రేమను చూశారు. ఇక నుంచి నా కోపాన్ని,  ద్వేషాన్ని చూపిస్తా’ అని అంటున్నారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌. హాలీవుడ్‌ అందాల తార ఏంజెలీనా జోలీ నటిస్తున్న తాజా చిత్రం ‘మాలిఫిసెంట్‌ : మిస్ట్రన్‌ ఆఫ్‌ ఈవిల్‌’. ఈ చిత్రంలో ఏంజెలినా.. మాలిఫిసెంట్‌ అనే దుష్టజీవి పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా హిందీలోనూ విడుదల కానుంది. ఏంజెలీనా పాత్రకు బాలీవుడ్‌ అందాల నాయిక ఐశ్వర్యరాయ్‌ గాత్రం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఐశ్వర్యరాయ్‌ డబ్బింగ్‌తో ఉన్న ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్‌ ప్రారంభంలో ఐశ్వర్య కనిపించి ఇక నుంచి తనలోని కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తానంటూ చెబుతారు. ఈ ట్రైలర్‌లో ఐశ్వర్య నల్ల డ్రెస్సులో అందంగా కనిపించారు. వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోచిమ్‌ రోనింగ్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.