close

తాజా వార్తలు

సైరా చిత్రంపై మహేశ్‌బాబు స్పందన!

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై ప్రిన్స్‌ మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. సైరాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని అందరూ తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సురేందర్‌ రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌తో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సైరా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని పేర్కొంటూ.. రత్నవేలుపై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాల్లో సైరా సినిమాటోగ్రఫీ బాగుందని అన్నారు. ప్రస్తుతం ప్రిన్స్‌ మహేశ్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.