close

తాజా వార్తలు

బాక్సాఫీస్‌ ఘరానా మొగుడు ఈజ్‌ బ్యాక్‌ - నాని

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నటన ‘సైరా’ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లిందని టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు. ‘సైరా’ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమని ఆయన పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిరంజీవి నటించిన చిత్రం ఇది. రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ‘సైరా’ చిత్రబృందాన్ని మహేశ్‌ బాబు అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా నాని, సంపత్‌నంది, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

‘ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం ‘సైరా’. ఈ సినిమాలో విజువల్స్‌, నిర్మాణ విలువలు ఒక ఎత్తు అయితే చిరంజీవి నటన సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది. రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డికి కంగ్రాట్స్‌. సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుకి ప్రత్యేక అభినందనలు. ‘సైరా’ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇటీవల కాలంలో నేను చూసిన అద్భుతమైన విజువల్స్‌ ఇవి.’ - మహేశ్‌ బాబు
‘నేను దక్షిణ కొరియాలో ఉన్నాను. అందుకే ‘సైరా’ చిత్రం చూడటం కుదరలేదు. కానీ, నాకు టాక్‌ వినపడింది. ఇండియాలో బాక్సాఫీస్‌ ఘరానా మొగుడు ఈజ్‌ బ్యాక్‌ అని. ఇక్కడ నుంచే చిరంజీవి సర్‌కు నా కౌగిలింతలు.’ - నాని
‘చిరంజీవి సర్‌ని ఇటువంటి చారిత్రాత్మక చిత్రాల్లో చూడాలనే నా కల నెరవేరింది. అత్యద్భుతమైన విజువల్స్‌. అద్భుతమైన సన్నివేశాలు. ఉత్కంఠభరితమైన నటన. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, తమన్నాతోపాటు సురేందర్‌ రెడ్డికి నా హృదయపూర్వక అభినందనలు.’ - సంపత్‌ నంది
‘‘మెగాస్టార్‌’ ఈ ఒక్కపేరు నేను పెద్దవాడిని అనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది.. నేను చిన్నపిల్లాడిని అయిపోయాను. సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. నన్ను నేను మర్చిపోయేలా చేసినందుకు థ్యాంక్యూ మెగాస్టార్‌. ‘సైరా నరసింహారెడ్డి’ కొణిదెల ప్రొడెక్షన్‌ థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం.’  - సాయిధరమ్‌ తేజ్‌
‘నేను చిరంజీవి ఫ్యాన్‌ని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలోని ప్రతి సన్నివేశం చాలా బాగుంది. స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలోని ప్రతి నటుడు చాలా బాగా నటించారు.’ - వరుణ్‌ తేజ్‌

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.