close

తాజా వార్తలు

గోదావరి తీరంలో.. వయ్యారాల చిన్నది..!

హైదరాబాద్‌: గోదావరి తీరం వద్ద ఇసుక తిన్నెల్లో తన వయ్యారాలతో కుర్రకారు గుండెల్ని దోచుకుంటున్న ఈ సుందరి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌తేజ్‌కు జంటగా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరుగుతోంది. గోదావరి తీరంలో పరికిణిలో వయ్యారంగా నిలుచున్న రాశీఖన్నా ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో రాశీఖన్నాను చూసిన కుర్రకారు ఆమె చాలా అందంగా ఉంది అని తెగ లైకులు కొడుతున్నారు.
గతేడాది వచ్చిన ‘తొలిప్రేమ’తో మంచి విజయాన్ని అందుకున్నారు రాశీ. ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తున్నారు. సాయి-రాశీ జంటగా 2016లో విడుదలైన ‘సుప్రీమ్‌’లో నటించారు. వెంకటేశ్‌, నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘వెంకీమామా’లో కూడా రాశీ నటిస్తున్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.