
తాజా వార్తలు
ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
హైదరాబాద్: ‘సైరా నరసింహారెడ్డి’ బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. దక్షిణాదిలో తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదో సినిమాగా ఇది నిలిచిందని తెలిపారు. ‘బాహుబలి 2’ రూ.214 కోట్లు, ‘సాహో’ రూ.127 కోట్లు, ‘2.ఓ’ రూ.94 కోట్లు, ‘కబాలి’ రూ.88 కోట్లు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.85 కోట్లతో ‘సైరా’ వాటి తర్వాత వరుసలో చేరిందన్నారు. రెండో రోజు రూ.100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిందని తెలిపారు.
‘సైరా’ తొలిరోజున ఆంధ్రప్రదేశ్‌లో రూ.47 కోట్లు, కర్ణాటకలో రూ.8.75 కోట్లు, తమిళనాడులో రూ. కోటి సాధించినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. మరోపక్క సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద మిలియన్ డాలర్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. అక్టోబరు 2న ‘సైరా’తోపాటు హిందీ సినిమా ‘వార్’, హాలీవుడ్ సినిమా ‘జోకర్’ విడుదలయ్యాయి. దీంతో బాక్సాఫీసు వద్ద వీటికి పోటీ తప్పలేదు. అయినా సరే ‘సైరా’ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ‘ధృవ’ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించారు. రామ్ చరణ్ నిర్మాత.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
