close

తాజా వార్తలు

ఊకలోని మంచు కరగదా?

ప్రశ్న: సాధారణంగా మంచు గడ్డల్ని ఊకలో ఉంచడం చూస్తుంటాం. అలా ఉంచితే అవి కరగకుండా ఉంటాయా?

 
 
 
 
- పి.నవ్య ప్రణతి, పదో తరగతి, సెయింట్‌ జోసఫ్‌ ఇంగ్లిష్‌మీడియం స్కూల్‌, ఇరుసుమండ

 

మంచు... నీరు అవ్వడానికి చాలా ఉష్ణం అవసరం. సమయం గడిచే కొద్దీ మంచు గడ్డలు ఉష్ణాన్ని గ్రహించి నీరుగా మారిపోతాయి. ఉష్ణం ఎప్పుడూ.. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోటికి ప్రవహిస్తుంది. ఈ ఉష్ణ ప్రసరణ వేగాన్ని తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతుల్ని ఉపయోగించి ఎక్కువసేపు వేడి వస్తువు వేడిగాను, చల్లని వస్తువు చల్లగానూ ఉండేటట్లు చేయగలుగుతున్నాం. కొన్ని పదార్థాలు తమ గుండా వేడిని ప్రవహించనిస్తాయి. వీటిని ఉష్ణ వాహకాలు అంటాం. లోహాలు అన్నీ మంచి ఉష్ణవాహకాలే. తమ నుంచి వేడిని ప్రవహించనివ్వని పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని అధమ ఉష్ణ వాహకాలు అంటాం. వరి ఊక, ఎండు కర్ర, దూది... లాంటివి అధమ ఉష్ణవాహకాలు. మంచు గడ్డ చుట్టూ వరి ఊకపోస్తే అది తన గుండా వేడిని సులభంగా ప్రవహించనివ్వదు. అందుకే ఊక లోపలున్న మంచుగడ్డ చాలా సేపటి వరకూ కరగకుండా ఉంటుంది. కానీ సమయం గడిచేకొద్దీ కరిగిపోక తప్పదు. ఎందుకంటే వేడిని వంద శాతం ఆపగల వస్తువులు ఏమీ లేవు.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.