close

తాజా వార్తలు

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటున్న సాయిధరమ్

హైదరాబాద్‌: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అని అంటున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథనాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. నభా నటేష్‌ కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించారు. నవంబర్‌ నుంచి రెగ్యూలర్‌గా షూటింగ్‌ జరగనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిట్‌ పోస్టర్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఈ రోజు విడుదల చేసింది.

‘చిత్రలహరి’ హిట్‌ తర్వాత సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జరిగింది. ‘సుప్రీమ్‌’ తర్వాత సాయి-రాశీ జంటగా నటిస్తున్న చిత్రమిది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.