close

తాజా వార్తలు

సినిమాలు మానేస్తానని చిరుతో చెబితే..

ఆయనది స్నేహంలో సోదర వాత్సల్యం

హైదరాబాద్‌: ‘మాటలు రావడం లేదు. ‘సైరా’లో నేను సుబ్బయ్యగా నటించా. ఓ మంచి సినిమాలో గొప్ప పాత్ర చేస్తున్నాననుకున్నా. కానీ, దానికి ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు. దీనికి చిరంజీవి గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయన రుణం ఎప్పటకీ తీర్చుకోలేనేమో’ అని నటుడు సాయిచంద్‌ అన్నారు. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. అక్టోబరు 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సోమవారం చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘సాయిచంద్‌ గురించి చాలా చెప్పాలి. మేమిద్దరం ‘మంచు పల్లకి’లో కలిసి నటించాం. నాటి నుంచి నేటి వరకు మేం సందర్భానుసారంగా కలుసుకున్నాం. ‘ఫిదా’ చూసిన తర్వాత ‘సైరా’ పాత్రకు ఆయనను తీసుకోవాలి అనుకున్నాం. ‘సైరా’లో వృద్ధుడిగా కనిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఆ పాత్ర నిడివి కూడా తక్కువే. ఈ చిత్రం కోసం ఆయన రెండేళ్లు మరో సినిమాకు ఒప్పుకోలేదు. ‘ఉప్పెన’ చిత్రంలో తండ్రి పాత్ర ఉందని సాయి చంద్‌కు చెప్పాను. అవకాశం వస్తే చేయమని అడిగా. ‘థ్యాంక్యూ సర్‌’ అని చెబుతాడు అనుకున్నా. కానీ, ఆయన ‘నేను చేయలేను’ అన్నారు. ఎందుకు అని అడిగితే.. ‘ఈ సినిమా కోసం గడ్డం పెంచాను. ఇలా మారాను. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా కోసం గడ్డం తీయాలి. ‘సైరా’ కోసం ఫేక్‌ గడ్డం పెట్టుకోవాలి.  నాకు నటుడిగా సంతృప్తి కావాలి. నేను ఈ సినిమాలో అంకితభావంతో నటించాలి’ అన్నాడు. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయా. నాకు అతడిపై గౌరవం మరింత పెరిగింది. అందరూ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశారు. అందుకే సినిమా ఇంత విజయం సాధించింది’’ అని అన్నారు.

అనంతరం సాయి చంద్‌ స్పందిస్తూ.. ‘చిరంజీవి గారి స్నేహంలో సోదర వాత్సల్యం ఉంటుంది. ‘మంచు పల్లకి’లోని మూమెంట్స్‌ను చిరు నా దగ్గర స్టెప్పులు వేయించారు. చాలా సులభం.. అని ప్రోత్సహించారు. నేను సినిమాలు మానేస్తున్నాను అని చెప్పినప్పుడు.. ‘సినిమాలు మానేయడం ఏంటి. మనం నటులం అని’ అన్నారు. ఆ తర్వాత అల్లూరి రామలింగయ్య మీద ఓ డాక్యుమెంటరీ తీయించారు’’ అని అన్నారు.

ఈ సందర్భంగా నటుడు రవికిషన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను అదృష్టవంతుడ్ని. దీనికి సురేందర్‌ రెడ్డికి, చిరంజీవికి ధన్యవాదాలు చెప్పాలి. ‘సైరా’లాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు చిరు కళ్లంటే చాలా ఇష్టం. బాలీవుడ్‌లోనూ చిరుకి, ఆయన డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారు. అందరూ ఆయన గురించి చెబుతుంటే కలవాలి అనుకున్నా. కానీ, ఇవాళ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయం. రామ్‌ చరణ్‌లాంటి కుమారుడ్ని అందరూ కోరుకుంటారు. ఆయన తన తండ్రికి గొప్ప బహుమతి ఇచ్చారు. చిరు సంపూర్ణమైన మెగాస్టార్‌. ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంటారు. చిరు 12 గంటలకు నిద్రపోతుంటారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి కసరత్తులు చేస్తుంటారు. 7 గంటలకు సెట్‌లో ఉంటారు. అలాంటి ఆయన్ను డైరెక్ట్‌ చేయాలంటే గట్స్‌ ఉండాలి. సురేందర్‌ రెడ్డికి ఆ ధైర్యం ఉంది. నేను రాజకీయాల్లోకి వెళ్లాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నప్పుడు చిరును సలహా అడిగా. ‘గెలుస్తాను అనే నమ్మకం ఉంటే రాజకీయాల్లోకి వెళ్లు’ అన్నారు. వెళ్లాను.. ప్రచారం చేశాను. ఎంపీగా గెలిచాను. ఆయన నన్ను ఆశీర్వదించారు’’ అని రవి కిషన్‌ చెప్పారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.