close

తాజా వార్తలు

జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు

ఆకట్టుకుంటున్న ‘వెంకీమామ’ కానుక.. చూడండి

హైదరాబాద్‌: ‘గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అంటున్నారు విక్టరీ వెంకటేష్‌. ఆయన, నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ ‘వెంకీ మామ’. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. యాక్షన్‌తోపాటు సరదా సన్నివేశంతో రూపొందించిన ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.