
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వరదలతో సతమతమౌతున్న బిహార్ ప్రజలకు తనవంతు సాయం అందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు లేఖ రాశారు. ‘ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రం దెబ్బతినడం నన్ను చాలా బాధిస్తోంది. ఈ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు నా సానుభూతి తెలుపుతున్నా. నా వంతుగా సహాయం చేస్తున్నా’ అని బిగ్‌బి పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా బిహార్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా పట్నా, కైమూర్, భాగల్పూర్తోపాటు తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లోని 1,400 గ్రామ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 73 మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది వరదల ప్రభావం వల్ల నష్టపోయారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
