
తాజా వార్తలు
ప్రశ్న: సుడిగుండాలు ఎందుకు వస్తాయి? నీటిలోవీ, గాలిలోవీ ఒకటేనా?
- ఆంచల్ భాటీ, పదో తరగతి, ప్రగతి ఇం.మీ స్కూల్, రాజమహేంద్రవరం
రెండు నీటి ప్రవాహాలు ఎదురెదురుగా ఒకదానికొకటి అడ్డగించే రీతిలో ఏర్పడినప్పుడు నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి. దీని వల్ల నీటి ప్రవాహం... తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరుగుతుంది. సముద్రాల్లో పెద్ద పెద్ద సుడిగుండాలు సాధారణంగా బలమైన కెరటాల వల్ల ఏర్పడతాయి. నీటి ప్రవాహానికి ఏదైనా అడ్డం వచ్చినా వస్తాయి. సన్నని మార్గంలో వేగవంతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ఏదైనా మునుగుతున్నప్పుడు కూడా చిన్న చిన్న సుడిగుండాలు ఏర్పడతాయి. భారీ సైజులో ఏర్పడేవి ప్రాణాంతకంగా ఉంటాయి. దేనినైనా నీటి కిందకు లాగేస్తాయి.
గాలిలో ఏర్పడే సుడిగుండాలు ప్రపంచంలో ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఇవి ఏర్పడ్డానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో గాలిలో సంక్షోభం ఏర్పడటం. పైగా గాలిలో అస్థిరత ఉండటం.
గాలికి అధిక ఉష్ణోగ్రత అంటే గాలిలోని అణువులు ఎక్కువ శక్తి కల్గి ఉండటం. తక్కువ ఉష్ణోగ్రత అంటే గాలిలోని అణువులు తక్కువ శక్తి కల్గి ఉండటం. ఇలా ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ప్రాంతం నుంచి తక్కువ శక్తి ప్రాంతానికి గాలి కదలడం వల్ల చెట్లు ఊగుతాయి. ఈ గాలి కదలికలు మితిమీరితే గాలిలో సుడిగుండాలు ఏర్పడతాయి.
నీటిలో సుడిగుండాలు, గాలిలో వాటికంటే కొంచెం తేడాగా ఉంటాయి. అవి ఏఏ ప్రాంతాలపై తమ ప్రభావం చూపుతాయి?
ఏవిధంగా ఏర్పడతాయి? అనే విషయాల్లో తేడా ఉంటుంది.
- డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్, కోనసీమ సైన్స్ పరిషత్, అమలాపురం
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
