
తాజా వార్తలు
ఇంద్రధనుస్సు ఆకాశంలోనే కాదు... ఓ పక్షిమీదకు ఎక్కింది... మరో చేపపైకి చేరిపోయింది... కొన్ని జీవులపైకీ పాకిపోయింది... మరి వాటి సంగతులేంటో చదివేద్దామా!
లైలక్ బ్రెస్టెడ్ రోలర్: రంగురంగుల్లో ఉన్న ఈ బుల్లి పిట్టను చూస్తుంటే... ఇదేదో హోలీ ఆడొచ్చినట్టుందే అనుకుంటున్నారా? కానీ దీని రూపమే ఇది. ఈ వర్ణాల వల్లే దీనికి రెయిన్బో రోలర్ అనీ పేరు. తలేమో ఆకుపచ్చ రంగులో, ముక్కు నల్లగా ఇంకా తల నుంచి తోక వరకు శరీరమంతా తెలుపు, పసుపు, నీలం, గోధుమ రంగులతో భలేగా ఉంటుంది. ఇది ఇంచుమించు పదిహేను అంగుళాల పొడవుంటుంది. ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంటుంది. |
డక్టిలొటమ్ బైకలర్: ఇదేదో కార్టూన్ బొమ్మలా ఉంది కదూ! కానీ నిజమైందే. దీన్నే ఇంద్రధనుస్సు మిడత, పెయింటెడ్ గ్రాస్ హోపర్ అనీ పిలుస్తారు. నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోతుంది. మగ మిడతలు అర అంగుళం పొడవుంటే ఆడవి అంగుళం కన్నా పెద్దగా ఉంటాయి. |
ప్యారెట్ ఫిష్: వీటిల్లో ఇంచుమించు 95 రకాల జాతులుంటాయి. ఇందులో రెయిన్బో ప్యారెట్ ఫిష్.. పదునైన పళ్లు, చిలుక ముక్కు, రంగు రంగుల రూపంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీని పళ్లతో పగడపు దిబ్బలపై ఉన్న నాచులాంటివి తింటూ వాటికి చిన్న రంధ్రాలు చేసి ఆవాసాలుగా మార్చుకుంటుంది. ఇంచుమించు నాలుగు అడుగుల పొడవుండే ఈ చేప సముద్రలోతుల్లో తిరుగుతుంటే భలే అందంగా కనిపిస్తుంది. |
హాలోవీన్ క్రాబ్: ఈ పీత గమ్మత్తుగా ఉంది కదా. చమక్కుమని మెరిసే దీని రంగుల వల్లే ఇది ప్రత్యేకం. ముందరి కాళ్లేమో వంకాయ రంగులో ఉంటాయి. ఇంకా నలుపు, ఎరుపు రంగులతో తల కనువిందుచేస్తుంది. ఇది ఆకుల్లాంటివి తిని కడుపు నింపుకొంటుంది. రాత్రివేళల్లో చురుగ్గా ఉండి రోజంతా విశ్రాంతి తీసుకుంటుంది. సముద్రతీరాల్లో తిరుగాడే ఈ పీత ఎక్కువగా బొరియల్లోనే ఉంటూ శత్రుజీవుల నుంచి తప్పించుకుంటుంది. |
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
