
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: భాషతో సంబంధం లేకుండా జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా.. ఇంతా కాదు..! హాలీవుడ్ నుంచి ఆ సినిమా వస్తుందంటే ప్రతి సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ‘బాండ్25’గా రాబోతున్న చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రెగ్ కథానాయకుడు. క్యారీ జోజి ఫుకునగ దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అధికారిక పోస్టర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 8న అమెరికాలో విడుదలవుతున్న ఈ చిత్రం దానికి ఐదు రోజులు ముందుగానే ఏప్రిల్ 3న భారత్‌లో ప్రదర్శితం కానుంది. ఎంఐ6 ఏజెంట్‌గా బాధ్యతల నుంచి తప్పుకొని జమైకాలో విశ్రాంతి తీసుకుంటున్న బాండ్ దగ్గరికి అతని మాజీ సహచరుడు వస్తాడు. ఓ శాస్త్రవేత్తను అపహరించిన వాడిని పట్టుకునే విషయంలో సాయం చేయమని కోరతాడు. దీంతో వేట మొదలుపెట్టిన బాండ్‌కు ఎలాంటి క్లిష్ట పరిస్థితులెదురయ్యాయి? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అరాచకాలకు తెగబడే విలన్‌ను ఎలా పట్టుకున్నాడన్న కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
