close

తాజా వార్తలు

ఉత్కంఠగా విజయ్‌ ‘బిగిల్‌’ ట్రైలర్‌

ఇది మహిళలకు అంకితం..

చెన్నై: తమిళ స్టార్‌ విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విజయ్‌ కఠినమైన ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించారు. ఆయన అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్న సన్నివేశాలు, వారు కష్టపడ్డ తీరు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మహిళలకు అంకితం ఇస్తున్నట్లు టీం పేర్కొంది.

ఈ చిత్రాన్ని తమిళంలో ‘బిగిల్‌’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. జాకీ ఫ్రాఫ్‌, వివేక్‌ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించారు. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అట్లీ-విజయ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.