
తాజా వార్తలు
ముంబయి: తన అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. 1973లో ఆయన నటి జయబాధురిని (వివాహం అనంతరం జయబచ్చన్గా పేరుమారింది) వివాహం చేసుకున్నారు. అప్పటి వరకు వరుస సినిమాలతో బిజీగా గడిపిన జయ ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో జోరు తగ్గించారు. అప్పుడప్పుడూ నచ్చిన పాత్రల్లో నటిస్తూ వచ్చారు. పిల్లలు శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్లను చూసుకుంటూ ఇంటి బాధ్యతలు మోశారు. బిగ్‌బికి వెన్నెముకలా నిలిచారు. దాదాపు 35 ఏళ్ల క్రితం బిగ్‌బి దంపతులు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జయను నటిగా తిరిగి ఎంట్రీ ఇవ్వడం గురించి ప్రశ్నించగా.. ‘నేను ముగ్గురు పిల్లల్ని పెంచి, పెద్ద చేయాలి’ అంటూ అమితాబ్ తన మూడో బిడ్డని ఆటపట్టించారు. వెంటనే బిగ్‌బి కల్పించుకుని.. ‘నేను తన కుమారుడని అంటోంద’ని అన్నారు.
అనంతరం పిల్లలతో బంధం గురించి అమితాబ్ మాట్లాడుతూ.. ‘పిల్లలతో అనుకున్నంత సమయం గడపలేకపోతున్నాను. ఈ విషయంలో బాధగా ఉంది. ఇది వాళ్లు మానసికంగా ఎదిగే వయసు’ అని అన్నారు. ‘అమిత్ (అమితాబ్) పిల్లలతో ఎక్కువ సమయమే గడుపుతున్నాడు. అది వాళ్ల ప్రవర్తనలో ప్రతిబింబిస్తోంది. అచ్చం తండ్రిలానే నడుచుకుంటున్నారు’ అని జయ నవ్వుతూ చెప్పారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- రివ్యూ: వెంకీ మామ
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
