close

తాజా వార్తలు

నాసాలో తెలుగు హీరోలు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్‌ తన స్నేహితులు సందీప్‌ కిషన్‌, ఆదర్శ్‌ బాలకృష్ణతో సరదాగా గడుపుతున్నారు. ఆదివారం ఈ ముగ్గురు కథానాయకులు నాసాని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు సందీప్‌ కిషన్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. దానితోపాటు ‘ఏ1-ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో సందీప్‌ నటించనున్నారు. మరోవైపు గతేడాది విడుదలైన ‘కిర్రాక్‌ పార్టీ’ చిత్రంలో నటించారు కథానాయకుడు నిఖిల్‌. ప్రస్తుతం ఆయన నటించిన ‘అర్జున్‌ సురవరం’ సినిమా విడుదల కావాల్సి ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.