close

తాజా వార్తలు

కీర్తి సురేశ్‌ కాదు.. నయనతారట?

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక నయనతార కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తెలుగు-తమిళంలో తెరకెక్కించనున్న థ్రిల్లర్‌ సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో తీయనున్న ఈ ప్రాజెక్టును రానా నిర్మించనున్నారట. కొరియా సినిమాకు రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పోలీసు పాత్ర కోసం రానా తొలుత కీర్తి సురేశ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వరుస సినిమాల వల్ల డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాకి నో చెప్పారట. ఇప్పుడు ఆ పాత్ర కోసం రానా.. నయన్‌ను కలిసినట్లు సమాచారం. నిర్ణయం చెప్పే ముందు ఓ సారి కొరియన్‌ సినిమాను చూడమని ఆమెను కోరారట. సినిమా చూసిన తర్వాత నయన్‌కు నచ్చిందని, నటించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

‘సైరా’తో మంచి హిట్‌ అందుకున్న నయన్‌ నటించిన ‘విజిల్‌’ దీపావళికి విడుదల కాబోతోంది. అదేవిధంగా ఆమె రజనీకాంత్‌కు జంటగా నటించిన ‘దర్బార్’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత నయన్‌ ‘నెట్రికన్‌’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దీన్ని నిర్మిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.