close

తాజా వార్తలు

పూరీ సినిమాలో రమ్యకృష్ణ

హైదరాబాద్‌: ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రలో ‘నా మాటే శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగుతో ప్రేక్షకులను అలరించిన నటి రమ్యకృష్ణ. ఆ తర్వాత ఆమె ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో అత్త పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ పూరీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రొమాంటిక్‌’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేటి నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాకి అనిల్‌ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ కథానాయిక. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో మంచి విజయం అందుకున్న పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాష్‌ పూరీ కథానాయకుడిగా ‘ఆంధ్రాపోరి’, ‘మెహబూబా’ చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన ‘మెహబూబా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.