close

తాజా వార్తలు

‘హౌస్‌ఫుల్‌-4’ ఎక్స్‌ప్రెస్‌పై పీయూష్‌ ట్వీట్‌

ముంబయి: రైళ్ల ద్వారా సినిమాలను ప్రమోట్‌ చేసుకునే సరికొత్త విధానానికి రైల్వేశాఖ నాంది పలికింది. ఈ సరికొత్త విధానాన్ని సినీ రంగంలోని ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రమోషన్‌ ఆన్‌ వీల్స్‌’ రైల్వే వారు చేపట్టిన సరికొత్త ఆలోచన. బాలీవుడ్‌లో రానున్న ‘హౌస్‌ఫుల్‌-4’ సినిమాని ప్రమోట్‌ చేస్తూ.. అక్టోబర్‌ 16, 17 తేదీల్లో ఒక ప్రత్యేక రైలు ముంబయి నుంచి దిల్లీకి వెళ్లనుంది. ఈ రైలు ప్రయాణంలో ఆ చిత్రబృందం కూడా ఉంటుంది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సినీ ప్రముఖులు ఈవిధమైన ప్రమోషన్స్‌ను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.’ అని గోయల్‌ పేర్కొన్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘హౌస్‌ఫుల్-4’ సినిమాని ప్రమోట్‌ చేసేందుకు అక్టోబర్‌16న ఈ ప్రత్యేక రైలు ముంబయి నుంచి బయలుదేరింది. ఈ రైలు సర్వీసుకు తాత్కాలికంగా ‘హౌస్‌ఫుల్‌-4’ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు. ఈ రైలు ప్రయాణంలో ఆ సినిమాకు సంబంధించిన చిత్రబృందం పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.