close

తాజా వార్తలు

‘బాలా’ అందుకే చంపుతాడు: అక్షయ్‌ కుమార్‌

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌-4’. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ పూర్తి గుండుతో కనిపిస్తారు. అయితే కొందరు వ్యక్తులు ఈ సినిమాలోని అక్షయ్‌కుమార్‌ లుక్‌ను ‘బాజీరావు మస్తానీ’ సినిమాలోని రణవీర్‌ లుక్‌తో పోలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో ఈ విషయంపై స్పందించిన అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘‘హౌస్‌ఫుల్‌-4’లో నేను నటించిన పాత్ర పేరు బాలా. చిన్నతనంలో చాలా పెద్ద జుట్టు ఉంటుంది. రెండేళ్ల వయసులో గుండు కొట్టిస్తారు. ఆ తర్వాత బాలాకు జుట్టు రాదు. దీంతో బాలాకు జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉన్నవాళ్లంటే ఇష్టం ఉండదు. అందుకే జుట్టు పొడవుగా ఉన్నవాళ్లని చంపుతుంటాడు. ఈ సినిమాలోని నా పాత్ర కోసం నేను ఎవర్ని అనుసరించలేదు. ‘బాజీరావు మస్తానీ’ సినిమాలోని రణవీర్‌ సింగ్‌లుక్‌కు ఈ సినిమాలోని నా లుక్‌కు అసలు సంబంధం లేదు.’ అని సినిమాలోని తన పాత్ర గురించి వివరించారు.

ప్రస్తుతం ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, కృతిసనన్‌, పూజాహెగ్డే, కృతి కర్బందా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటించారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.