close

తాజా వార్తలు

‘అసురన్‌’ సినిమా కాదు..: స్టాలిన్‌

చెన్నై: తమిళ నటుడు ధనుష్‌ నటించిన సినిమా ‘అనుసరన్‌’. వెట్రిమారన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాను చూసిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసించారు. ‘అసురన్‌’ సినిమా కాదు. అది ఒక పాఠం. కులవివక్ష, భూహక్కులపై ఈ సినిమాలో బాగా చూపించారు. వెట్రిమారన్‌ సినిమాను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ధనుష్‌ ఈ పాత్రలో బాగా ఒదిగిపోయారు. చిత్రబృందానికి నా అభినందనలు.’ అని స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన ధనుష్‌ సోషల్‌మీడియా వేదికగా స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘బిజీ షెడ్యూల్‌లో కూడా మీరు మా ‘అసురన్‌’ సినిమాను చూసి, చిత్రబృందాన్ని అభినందించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.