close

తాజా వార్తలు

‘రాజుగారి గది2’ వెంకటేశ్‌తో అనుకున్నా: ఓంకార్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు వెంకటేశ్‌తో ‘రాజుగారి గది 2’ సినిమాని తీయాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేదు. కాకపోతే త్వరలో నేను ఆయనతో సినిమా చేస్తాను అని అంటున్నారు దర్శకుడు ఓంకార్‌. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు రియాల్టీ షోలతో ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు‌. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘రాజుగారి గది 3’. అక్టోబర్‌ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓంకార్‌ విలేకర్లతో ముచ్చటించారు.

మీ తమ్ముడు అశ్విన్‌ను హీరోగా నిలబెట్టడం కోసమే ‘రాజుగారి గది 3’ తీశారా?

ఓంకార్‌: నా సినిమాలో కథకే ప్రాధాన్యం ఇస్తాను. ఈ కథను రాసుకున్న సమయంలో మా తమ్ముడు అశ్విన్‌ ఈ కథకు సరిపోతాడు అని అనిపించింది. అందుకే అతనితోనే ఈ సినిమా తీశాను. కానీ ఈ సినిమా ద్వారా నేను అశ్విన్‌కు ఇచ్చిన మాట తీరుతుంది. వాడిని ఓ హీరోగా ఈ సినిమా నిలబెడుతుంది.

వెంకటేశ్‌తో సినిమా తీస్తున్నారా?

ఓంకార్‌: ‘రాజుగారి గది 2’ను మొదట వెంకటేశ్‌తోనే తెరకెక్కించాలనుకున్నాను. కానీ ఆ సమయంలో ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడంవల్ల నాగార్జునతో ఆ సినిమా చేశాను. కానీ తప్పకుండా ‘రాజుగారి గది’లోని ఒక పార్ట్‌ను మాత్రం వెంకటేశ్‌తో తీస్తాను. ఆయనతో సినిమా చేయాలి అనేది నా కోరిక. త్వరలోనే నేను ఆయనతో సినిమా చేస్తా.

హర్రర్‌ సినిమాలపరంగా సినీ ఇండస్ట్రీలో ఏమైనా మార్పు వచ్చిందా?

ఓంకార్‌: నేను ‘రాజుగారి గది’ సినిమా తీసిన సమయంలో సినీ పరిశ్రమలో హర్రర్‌ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు పరిశ్రమలో చాలా హర్రర్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులకు కథ నచ్చినప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది. నా కథ మీద నాకు నమ్మకం ఉంది. ‘రాజుగారి గది 3’ సినిమా విజయం సాధిస్తుంది.

‘రాజుగారిగది 3’లో కొత్తగా ఏం చూపిస్తారు?

ఓంకార్‌: ‘రాజుగారిగది’ సినిమా విజయవంతం కావడానికి ప్రధానం కారణం కామెడీ. ఆ సినిమాలో మంచి మెసేజ్‌తోపాటు కామెడీ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేశారు. ‘రాజుగారి గది 2’లో మాత్రం మంచి మెసేజ్‌ ఉంది కానీ 
ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు బాగా మిస్‌ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పూర్తిస్థాయిలో ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

అశ్విన్‌కు ఈ సినిమా ఏవిధంగా ఉపయోగపడుతుంది?

ఓంకార్‌: నా తమ్ముడు అశ్విన్‌ నేను దర్శకత్వం వహించిన సినిమాలతోపాటు వేరే సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పటివరకూ అశ్విన్‌కు మంచి హీరోగా గుర్తింపు రాలేదు. కానీ ‘రాజుగారి గది3’ సినిమా హీరోగా అశ్విన్‌కు గుర్తింపు తీసుకువస్తుంది.

తమన్నా ఈ సినిమా తప్పుకున్నాక ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారు?

ఓంకార్‌: వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నాక ఆ పాత్ర కోసం నేను కాజల్‌, తాప్సీలతో మాట్లాడాను. కాజల్‌కు ఆ కథ బాగా నచ్చింది. నా సినిమాలో నటించడానికి ఆమె ఆసక్తి కనబరిచారు. ఆమె కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నెలలో వారంరోజులు మాత్రమే నా సినిమాకు ఇస్తానన్నారు. ఆ సమయంలో నేను వేరే రియాల్టీ షోలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవుతుందని భావించి చివరికి అవికాగోర్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నాను. 

తమన్నాకు చెప్పిన కథ ఇదేనా?
ఓంకార్‌: నేను తమన్నాను చెప్పిన కథ ఇది కాదు. తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకున్నాక నేను ఈ కథలో చాలా మార్పులు చేశాను. తమన్నాకు చెప్పిన కథకు, ఇప్పుడు తెరకెక్కించిన కథకు సంబంధం ఉండదు. తమన్నాకు చెప్పిన కథను తప్పకుండా ఒక పెద్ద కథానాయికతో తెరకెక్కిస్తాను.

ఈ సినిమాలో అవికాగోర్‌ ఎలా కనిపించనున్నారు?
ఓంకార్‌: అవికాగోర్‌ ‘చిన్నారి పెళ్లికూతురు’గా ప్రేక్షకులకు సుపరిచితమే. తమన్నా తప్పుకున్నాక ఈ సినిమాలోని పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాను. చివరికి అవికాగోర్‌ అయితే బాగుంటుందనిపించింది. తను మంచి టాలెంట్‌ ఉన్న నటి. ఈ సినిమాలో అవికాగోర్‌ దెయ్యం పాత్రలో బాగా నటించారు.

అక్టోబర్‌ నెలతో మీకు ఏమైనా సెంటిమెంట్‌ ఉందా?

ఓంకార్‌: నేను అక్టోబర్‌ నెలలోనే పుట్టాను. నాకు సెంటిమెంట్‌ అని ఏమి లేదు. అనుకోకుండా నేను దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది’, ‘రాజుగారి గది2’ సినిమాలు అక్టోబర్‌లోనే విడుదలయ్యాయి. ఇప్పుడు దర్శకత్వం వహించిన ఈ ‘రాజుగారి గది3’ సినిమా కూడా అక్టోబర్‌లోనే విడుదల అవుతోంది.

ఈ సినిమా దర్శకుడిగా మీకు ఎటువంటి విజయాన్ని అందిస్తుంది?

ఓంకార్‌: ‘రాజుగారి గది3’ మాస్‌ సినిమా. ఈ సినిమా దర్శకుడిగా నాకు మంచి పేరు తీసుకువస్తుంది. అలాగే తక్కువ సమయంలో నేను అనుకున్న కథను తెరకెక్కించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులు బాగా నచ్చుతుంది.

నటుడిగా మారాలని అనుకుంటున్నారా?

ఓంకార్‌: నటుడిగా మారాలని అనుకోవడం లేదు. నేను దర్శకుడిగానే ఉంటాను. అశ్విన్‌ను మంచి నటుడిగా, కల్యాణ్‌ను నిర్మాతగా చూడాలనుకుంటున్నాను.

‘రాజుగారి గది3’ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు?

ఓంకార్‌: ‘రాజుగారి గది3’ తర్వాత నేను ఓ రియాల్టీ షో చేస్తున్నాను. త్వరలో ఆ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం నా దగ్గర క్రీడా నేపథ్యంలో సాగే ఒక సినిమా కథ ఉంది. దానితోపాటు ‘రాజుగారి గది4’ కథ కూడా ఉంది. వీటిల్లో ఏది ముందు తెరకెక్కించాలనేది ఇంకా నేను ఫిక్స్‌ అవ్వలేదు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.