close

తాజా వార్తలు

కీర్తి సురేశ్‌ బర్త్‌డే స్పెషల్‌ చూశారా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయిక కీర్తి సురేశ్‌ నటిస్తున్న చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆ సినిమా నుంచి ఓ సాంగ్‌ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘మిస్‌ ఇండియా’ షూటింగ్‌ సమయంలో కీర్తి సురేశ్‌పై చిత్రీకరించిన పలు సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఉన్నత స్థాయికి ఏవిధంగా చేరింది అనే విషయంపై ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ టీజర్‌ చూస్తే తెలుస్తుంది. జగపతిబాబు, నరేష్‌, నవీన్‌ చంద్రా, రాజేంద్రప్రసాద్‌, భానుశ్రీ మెహ్రా, నదియా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మహేశ్‌ ఎస్‌.కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.