close

తాజా వార్తలు

చిరు పక్కన ఎవరు?

చిరంజీవి - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నవంబరు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈలోగా కథానాయికల వేటను ముమ్మరం చేశారు. ఈ చిత్రంలో చిరుతో కలసి నటించేది ఎవరన్న విషయంలో  తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నాయికల జాబితాలో చాలా పేర్లు    వినిపిస్తున్నాయి. అనుష్క, కాజల్‌,  నయనతార.. పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు త్రిష పేరు కూడా చేరింది. చిరు - త్రిష ఇది వరకు ‘స్టాలిన్‌’లో నటించారు. త్రిష కూడా తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఓ మంచి  సినిమాతో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తోంది. అన్నీ కుదిరితే ‘స్టాలిన్‌’ జోడీని మరోసారి చూడొచ్చు.
దేవాలయాల నేపథ్యంలో..?: కొరటాల శివ కథలన్నీ సామాజిక నేపథ్యం చుట్టూ నడిచేవే. ఓ బలమైన అంశాన్ని కమర్షియల్‌ విలువలు జోడించి చెప్పడం ఆయన శైలి. ఈసారీ అలాంటి కథే ఉంటుందట. దేవాలయాలు, వాటి సమస్యల చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. చిరు పాత్ర రెండు కోణాల్లో ఉంటుందని  సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి ఫ్లాష్‌ బ్యాక్‌ పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారని తెలుస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.