close

తాజా వార్తలు

అందుకే ‘బిగ్‌బాస్‌’ షో ఒప్పుకోలేదు:గెటప్‌ శ్రీను

సుధీర్‌-రష్మి పెళ్లి చేసుకోరు!

ఇంటర్నెట్‌డెస్క్‌: వివిధ గెటప్‌లతో ‘జబర్దస్త్‌’ షోకు మంచి క్రేజ్‌ తీసుకొచ్చిన నటుడు శ్రీను. గెటప్‌ శ్రీనుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన వెండితెరపై తనదైన శైలిలో నవ్విస్తున్నారు. సుధీర్‌, రాంప్రసాద్‌లతో కలిసి శ్రీను నటించిన చిత్రం ‘త్రీ మంకీస్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శ్రీను నటించిన ‘రాజుగారిగది 3’ శుక్రవారం విడుదలైంది. ఇందులోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 

త్రీ మంకీస్‌ ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
గెటప్‌ శ్రీను: ఇంకా ఏమీ అనుకోలేదు. నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మేం సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. మిమ్మల్ని కూడా అలరిస్తుందని అనుకుంటున్నా.

‘రాజుగారి గది3’ ఎలా ఉండబోతోంది?
గెటప్‌ శ్రీను: ఈ సినిమాను ఓంకార్‌గారు చాలా చక్కగా తెరకెక్కించారు. ఇందులో అశ్విన్‌ నటన బాగుంటుంది. మొదటి రెండు చిత్రాలను ఆదరించినట్లే దీన్ని కూడా ప్రేక్షకుల ఆదరిస్తారని భావిస్తున్నా.

మీరు హీరోగా చేసే అవకాశం ఉందా?
గెటప్‌ శ్రీను: అలా ఏమీ లేదు. మంచి పాత్రలు, విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నా.

‘త్రీ మంకీస్‌’ కాన్సెప్ట్‌ ఏంటి?
గెటప్‌ శ్రీను: మీరు టీజర్‌లో చూసిన దాని తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో మిమ్మల్ని బాగా నవ్విస్తాం. ద్వితీయార్ధంలో ఆ ఫన్‌ కొనసాగుతూనే ఒక ఎమోషనల్‌ డ్రామా నడుస్తుంది. కామెడీ, ఎమోషన్‌ రెండూ ఉంటాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. దర్శకుడు అనిల్‌గారు స్క్రిప్ట్‌ బాగా రాసుకున్నారు. అందులో మా జోక్యం ఏమీ లేదు.

సన్నీ ఇందులో నటించడం లేదా?
గెటప్‌ శ్రీను: మాలో అందరికన్నా బిజీ ఆర్టిస్‌ తనే. సినిమాలు, సీరియల్స్‌తో తీరికలేకుండా ఉంటాడు. 

ముగ్గురూ కలిసి సినిమా చేయడం ఎలా అనిపించింది?
గెటప్‌ శ్రీను: ఇప్పటివరకూ మేం ముగ్గురం ‘జబర్దస్త్‌’తో అలరించాం. సినిమా అనేది నిజంగా కొత్త ఫీల్‌. అదొక ముందడుగు అని చెప్పవచ్చు. 

మిమ్మలి ఎవరో డైరెక్టర్‌ తిట్టారని రూమర్స్‌ వినిపించాయి.. అది నిజమేనా?
గెటప్‌ శ్రీను: అది ఎప్పుడో జరిగింది. ఇండస్ట్రీలో అవన్నీ సహజంగా జరుగుతుంటాయి.

‘బిగ్‌బాస్‌’ షో గురించి మీ అభిప్రాయం?
గెటప్‌ శ్రీను: ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. మొదట్లో నన్ను కూడా అడిగారు. అయితే, అందులో ఉండిపోతే వేరే షోలు చేయడానికి ఉండదు. అందుకే ‘బిగ్‌బాస్‌’ చేయడానికి మేం  ఒప్పుకోలేదు. ఒక వేళ ఒప్పుకొన్నా మొదటి వారమే బయటకు వచ్చేస్తా. 

మీరు టీం లీడర్‌గా ఎందుకు చేయడం లేదు?
గెటప్‌ శ్రీను: గతంలో చేశా. ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఒకరోజు గ్యాప్‌తోనే షూట్‌ చేస్తారు. నేను ‘జబర్దస్త్‌’లో టీమ్‌ లీడర్‌గా ఉండేవాడిని. దీంతో ఆ తర్వాతి రోజు జరిగే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో నటించాలి. నాలుగు కంటెంట్‌లు ఆలోచించాలి. రాంప్రసాద్‌ రాయాలి. ఇద్దరం నటించాలి. దీంతో క్వాలిటీ కంటెంట్‌ రావడం లేదు. అందుకే నేను టీమ్‌ లీడర్‌గా చేయనని చెప్పా.

సుధీర్‌-రష్మి మ్యారేజ్‌ ఎప్పుడు?
గెటప్‌ శ్రీను: వారిద్దరూ పెళ్లి చేసుకోరు. ఇద్దరివి వేర్వేరు జీవితాలు. షూటింగ్‌ అయిపోగానే ఎవరి లోకం వాళ్లది. మిమ్మల్ని అలరించడానికి ఒక కాంబినేషన్‌గా అలా చూపిస్తారు. కానీ, అది నిజం కాదు. సుధీర్‌కు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు.

బిల్డప్‌ బాబాయ్‌ పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారా?
గెటప్‌ శ్రీను: ‘రాజుగారి గది3’లో నా పాత్ర అలాంటిదే.

‘జబర్దస్త్‌’ ద్వారా మీరు సంపాదించిన దాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారా?
గెటప్‌ శ్రీను: అవన్నీ చెప్పుకోకూడదు కానీ, మా జబర్దస్త్‌ టీమ్‌లోని వాళ్లందరూ తమ చేతనైన సాయం సేవా కార్యక్రమాలకు చేస్తారు. 

హైపర్‌ ఆది కారు కొనుకున్నారట నిజమేనా?
గెటప్‌ శ్రీను: అవును కొన్నాడు. కానీ, తనకు డ్రైవింగ్‌ రాదు. దాన్ని వాళ్ల తమ్ముడికి ఇచ్చేశాడు. 

‘త్రీ మంకీస్‌’లో సన్నీని ఎందుకు తీసుకోలేదు?
గెటప్‌ శ్రీను: సినిమాలో ఒక పాత్ర కోసం అనుకున్నాం. కానీ, ఆ రోజు సన్నీకి వేరే సీరియల్‌ ఉండటంతో అది చేయడం కుదరలేదు.

ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు?
గెటప్‌ శ్రీను: బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నా. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.