
తాజా వార్తలు
హైదరాబాద్: అగ్రకథానాయకుడు బాలకృష్ణ డైలాగులతో అలరించి ‘జూనియర్’ బాలయ్యగా పేరు పొందిన గోకుల్ సాయి కృష్ణ శుక్రవారం మృతిచెందాడు. గోకుల్ సాయి చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ఎ.వి.నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలిల రెండో కుమారుడు. గత రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో గోకుల్ను బెంగళూరులోని రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోకుల్ శుక్రవారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ సోషల్మీడియా వేదికగా గోకుల్ సాయి కృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపారు.
‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి అభిమాని గోకుల్ ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ జ్వరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
బుల్లితెర వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలు సైతం గోకుల్ సాయి కృష్ణ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ‘గోకుల్ సాయి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇక నుంచి నిన్ను నేను బాగా మిస్ అవుతాను. నువ్వు లేవనే బాధ నుంచి మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నా. కోరుకున్న రంగంవైపు తమ పిల్లల్ని ప్రోత్సహించే ఎంతో మందికి మీ తల్లిదండ్రులు ఆదర్శం’ అని అనసూయ తెలిపారు.
‘గోకుల్ సాయి కృష్ణ మృతి చెందాడని విని నేను చాలా బాధపడ్డాను. ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ చిన్నారి డెంగ్యూతో మృతిచెందాడనే విషయాన్ని నేను అనసూయ ద్వారా తెలుసుకున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డెంగ్యూ జ్వరం లక్షణాలను గురించి అవగాహన పొందండి’ అని రష్మి గౌతమ్ పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
