close

తాజా వార్తలు

భారతీయుడు2: 2000 జూనియర్‌ ఆర్టిస్టులు

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ చిత్రం ‘భారతీయుడు’. 22 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భారతీయుడు-2’ సినిమా వస్తోంది. కాజల్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ  చిత్రబృందం షూటింగ్‌కు కోసం భోపాల్‌ వెళ్లనున్నారట. అక్కడ రూ.40 కోట్ల బడ్జెట్‌తో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పీటర్‌హెయిన్స్‌ పర్యవేక్షణలో 25 రోజుల పాటు చిత్రీకరించే ఈ యాక్షన్‌ సన్నివేశం కోసం సుమారు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పనిచేయనున్నారట. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియాభవానీ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.