
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల వికెట్ కీపర్ ఆలెక్స్ కారే అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. దేశవాళీ క్రికెట్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో క్వీన్స్లాండ్ X దక్షిణ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కారే ఒంటి చేత్తో అద్భుత రీతిలో క్యాచ్ అందుకొని ఆశ్చర్యపరిచాడు. క్వీన్స్లాండ్ ఓపెనర్ మాట్ రెన్షా లెగ్‌సైడ్ వెళ్లే బంతిని ఫ్లిక్ చేయడంతో అది వికెట్ల వెనుక దూరంగా వెళ్లింది. వెంటనే స్పందించిన కారే అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియోను ఓ క్రీడా ఛానల్ ట్విటర్లో పోస్టు చేసింది.
ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు అతడి క్యాచ్ అద్భుతమని పేర్కొనడంతో పాటు ప్రస్తుత కెప్టెన్, టెస్టు సారథి టిమ్‌పైన్‌ను తొలగించి కారేను టెస్టుల్లో ఆడించాలని కోరుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న కారే ఇప్పటివరకు 29 వన్డేల్లో 805 పరుగులు చేశాడు. ఇటీవల ప్రపంచకప్‌లోనూ తన ముద్ర వేశాడు. 10 మ్యాచ్‌ల్లో 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. 2018 జనవరిలో కారే పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేసినా ఇంకా టెస్టుల్లోకి రాలేదు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు దక్షిణ ఆస్ట్రేలియా 221 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వీన్స్లాండ్ ఆటముగిసే సమయానికి 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
