close

తాజా వార్తలు

అభిమానికి రజనీకాంత్‌ స్వీట్‌ వార్నింగ్‌

తనను ఫాలో కావొద్దని సూచన

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను దేవుడిలా ఆరాధించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఆయన  హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి శుక్రవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులందరూ ఒక్కసారిగా వచ్చి ఆయనను చుట్టు ముట్టారు. ఆయనతో ఫొటోల కోసం ఎగబడ్డారు. వారందరికీ నవ్వుతూ సమాధానం చెబుతూ అక్కడి నుంచి రజనీ తన నివాసానికి వెళ్లడానికి కారెక్కారు. 

ఇంతలో ఓ అభిమాని తన బైక్‌లో రజనీ కార్‌ను ఫాలో అయ్యారు. అలా సూపర్‌స్టార్‌ ఇంటివరకు ఆ వ్యక్తి వెళ్లాడు. దీన్ని గమనించిన రజనీ తన ఇంటి గేట్‌ వాచ్‌మెన్‌ ద్వారా ఆ అభిమానిని ఇంట్లోకి పిలిపించారు. ‘ఇలాంటి సమయంలో బైక్‌పై ప్రయాణం మంచిది కాదు. చాలా ప్రమాదకరమైంది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు’ అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చి ఒక ఫొటో దిగి పంపారు.

‘#WelcomeBackThalaiva’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండగా సదరు అభిమాని ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం రజనీ ‘దర్బార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.