close

తాజా వార్తలు

నూటొక్క జిల్లాల అందగాడు..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ కొత్త ప్రాజెక్టు ఖరారైంది. ఈ సినిమాకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ‘చి.ల.సౌ’ ఫేం రుహానీ శర్మ కథానాయిక. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు క్రిష్‌ కలిసి నిర్మిస్తుండటం విశేషం. శనివారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నూతన దర్శకుడు సాగర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అవసరాల ఈ ఏడాది ‘యన్‌.టి.ఆర్‌- కథానాయకుడు’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన రచయిత, దర్శకుడు డీవీ నరసరాజు పాత్రను పోషించారు. ప్రస్తుతం ఆయన ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే సినిమాను తీస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆయన రచయిత, దర్శకుడిగా పనిచేస్తున్నారట.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.