close

తాజా వార్తలు

రాయ్‌లక్ష్మి ఇమేజ్‌ పెరుగుతుంది

దర్శకుడు వెంకటేశ్‌

‘సిండ్రెల్లా’లో రాయ్‌లక్ష్మి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: హర్రర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సిండ్రెల్లా’. రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. వినో వెంకటేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎస్‌జే సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘రొటీన్‌ ఫార్ములాలో తెరకెక్కే దెయ్యం సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈ సినిమాతో రాయ్‌లక్ష్మి ఇమేజ్‌ పెరుగుతుంది. ఆమె కెరీర్‌లోనే ఇదో ముఖ్యమైన చిత్రం. నటన పరంగా మంచి మార్కులు పడతాయి. సాక్షి అగర్వాల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తుంది. రోబోశంకర్‌, వినోద్‌, గజరాజ్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. ‘కాంచన 2’కు సంగీతం అందించిన అశ్వమిత్ర ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ‘సిండ్రెల్లా’ అనే పేరు అందరికి సుపరిచితం. సినిమా కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్‌కు ఆధరణ వస్తోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నామని’ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.