close

తాజా వార్తలు

ధ్రువ్‌ కన్నా విక్రమ్‌కే పెరుగుతోంది హార్ట్‌ బీట్‌!

‘ఆదిత్య వర్మ’లో ఓ దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘ఆదిత్య వర్మ’ చిత్రం కోసం నటుడు విక్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ద్వారా విక్రం కుమారుడు ధ్రువ్‌ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ధ్రువ్‌ కన్నా విక్రంకే హార్ట్‌బీట్‌ పెరుగుతోందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ-4 ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణంలోని ఈ చిత్రం రెండోసారి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గిరిసాయి దర్శకత్వం వహిస్తున్నారు. పనితా చంద్‌ కథానాయికగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పెద్ద హీరోల చిత్రాలు ఉన్నందున నవంబరు 8వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సినిమా పాటలను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. గతంలోనే బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్మ’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.