close

తాజా వార్తలు

162 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్‌

335 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

రాంచి: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ ఆటగాళ్లు 162 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. ఓవర్‌ నైట్‌ స్కోరు 9/2తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా.. 153 పరుగులు జోడించింది. ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు తీయగా..షమీ, నదీమ్‌, జడేజా రెండేసి వికెట్లు తీశారు. 

ఆదుకున్న హంజా-బవుమా జోడి
ఆట మొదలు పెట్టిన కొద్దిసేపటికే దక్షిణాఫ్రికా డుప్లెసిస్‌(1) వికెట్‌ కోల్పోయింది. ఆరో ఓవర్లో ఉమేశ్‌ వేసిన ఐదో బంతికి అతడు బౌల్డ్‌ అయ్యాడు. తర్వాత హంజా-బవుమా జోడీ పర్యాటక జట్టును ఆదుకుంది. దాదాపు 20 ఓవర్లపాటు క్రీజులో నిలబడి ఈ ఇద్దరూ స్కోరు బోర్డును పెంచారు. కాపేపు టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో హంజా(62) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 28వ ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని ఆడిన ఇతడు బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 91 పరుగుల హంజా-బవుమా జోడీ భాగస్వామ్యానికి తెరపడింది. వీరి ఇన్నింగ్స్‌లో వీరిదే అత్యుత్తమ భాగస్వామ్యం. తర్వాత 29వ ఓవర్లోనే బవుమాను(32)ను నదీమ్‌ స్టంప్‌ఔట్‌ చేశాడు. 31.4వ ఓవర్లో జడేజా వేసిన బంతికి క్లాసెన్‌(6) బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం 36 ఓవర్ల వద్ద అంపైర్లు భోజన విరామం ప్రకటించారు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 129/6.
భోజన విరామం అనంతరం వికెట్ల పతనం
లంచ్‌ విరామం తర్వాత మ్యాచ్‌ మొదలు పెట్టిన సఫారీ జట్టుకు భారత బౌలర్లు మళ్లీ షాకిచ్చారు. ఆట మొదలు పెట్టిన తొలి ఓవర్లోనే ఏడో వికెట్‌ పడగొట్టారు. 36వ ఓవర్లో షమీ వేసిన నాలుగో బంతికి పీట్‌(4) ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత 37.5వ ఓవర్లో రబాడను ఉమేశ్‌ రనౌట్‌ చేశాడు. 
టెయిలెండర్లు మళ్లీ..
వెంట వెంటనే వికెట్లు పతనం అవుతుండటంతో దక్షిణాఫ్రికా 150 పరుగులు దాటకుండానే ఆలౌట్‌ అవుతుందనుకున్నారంతా. కానీ, టెయిలెండర్లు పట్టుదలతో నిలబడ్డారు. భారత బౌలర్లను మొండిగా ఎదుర్కొన్నారు. టీమిండియా బౌలర్లు మళ్లీ జోరు పెంచి వరుస ఓవర్లలో ఇద్దర్ని ఔట్‌ చేశారు. 55.1 ఓవర్లో లిండే(37)ను ఉమేశ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత 56.2వ ఓవర్లో నదీమ్‌ వేసిన బంతికి ఎన్రిచ్‌(4)ను నదీమ్‌ ఔట్‌ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత్‌ 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికాను ఫాలోఆన్‌ ఆడేందుకు భారత్‌ ఆహ్వానించింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.